అ... సినిమాతో నిర్మాతగా మారాడు నాని. వాల్ పోస్టర్ సినిమా పతాకంపై సినిమాలు తీస్తున్నాడు. ఇప్పుడు హిట్ సినిమాతో వచ్చాడు. నాని సినిమా అనగానే ప్రేక్షకులలో ఓ రకమైన అంచనా ఏర్పడుతుంది. హీరో నాని కాకపోవొచ్చు. కానీ... తన అభిరుచిపై అందరికీ నమ్మకం ఉంది. కాబట్టి... నాని సినిమాలు విడుదలకు ముందే ప్రాఫిట్స్‌లోకి వెళ్తున్నాయి. హిట్ కూడా ఆ జాబితాలో చేరుతుంది. ఈ సినిమాని చాలా తక్కువ బడ్జెట్లో తీశారు.
ఓటీటీ ఫ్లాట్‌ఫామ్‌కి అమ్ముకున్నా డబ్బులు వచ్చేస్తాయి. ఇక శాటిలైట్, హిందీ డబ్బింగ్ రైట్స్ అదనం. ఎలా చూసినా ఈ సినిమాతో నాని కనీసం 2 నుంచి 3 కోట్లు జేబులో వేసుకున్నట్టే లెక్క. కొత్త వాళ్లకు అవకాశం ఇచ్చినట్టూ ఉంటుంది, డబ్బులు చేసుకున్నట్టూ ఉంటుంది. పైగా సినిమా హిట్టయితే.. ఆ క్రెడిట్‌ని తన ఖాతాలో వేసుకోవొచ్చు. మొత్తానికి నాని మంచి తెలివితేటలనే చూపిస్తున్నాడు. నిర్మాతగా తన నుంచి మున్ముందు ఎలాంటి సినిమాలొస్తాయో చూడాలి.