సమాన స్థాయి లో ఉన్న ఇద్దరు ఒకేచోట పని చేస్తే.. ఏదో ఓ సందర్భంలో తప్పకుండా `ఈగో` సమస్యలు తలెత్తుతాయి. ఇలాంటి గొడవలు సాధారణంగా చిత్రసీమలో కనిపిస్తుంటాయి. నాని - సాయి పల్లవి మధ్య కూడా ఇలాంటి ఈగో గోలలు జరిగాయని, ఎడ మొహం, పెడ మొహంలా ప్రవర్తించారని చాన్నాళ్ల క్రితం వార్తలొచ్చాయి. ఇద్దరూ కలిసి `ఎం.సీ.ఏ` (మిడిల్ క్లాస్ అబ్బాయి) కోసం పనిచేసిన సంగతి తెలిసిందే. ఆసెట్లో ఒకరిపై ఒకరు ఆధిపత్యం చెలాయించాలని చూశారని, ఒకరంటే ఒకరికి ఒక్క క్షణం కూడా పడలేదని, ఇంకెప్పుడూ కలిసి పనిచేయకూడదన్న నిర్ణయానికి వచ్చారని వార్తలొచ్చాయి.
అయితే ఇప్పుడు `శ్యామ్ సింగరాయ్` కోసం ఇద్దరూ మళ్లీ జట్టు కట్టారు. కలసి పని చేస్తున్నారు. నిన్నే ఈ సినిమాకి క్లాప్ కొట్టారు. ఈ కార్యక్రమంలో సాఇయ పల్లవి కూడా పాల్గొంది. నాని - సాయి పల్లవి హుషారుగా, స్నేహితుల్లా మాట్లాడుకోవడం కనిపించింది. దాంతో.. నాని - పల్లవి ఇద్దరూ పాత గొడవల్ని మర్చిపోయి .. మళ్లీ ఫ్రెష్ గా పనిచేస్తున్న ఫీలింగ్ వచ్చింది. ఇద్దరి మధ్య గొడవలు నిజమే అని, అయితే క్రియేటీవ్ పీల్డ్లో ఇవన్నీ మామూలే అని, అందుకే అవన్నీ మర్చిపోయి మళ్లీ కలసి పనిచేయడానికి సిద్ధమయ్యారని చెప్పుకుంటున్నారు. నిజానికి వీళ్లిద్దరి మధ్య ఆ నాడు గొడవ జరిగిందా? లేదంటే అది కూడా కట్టు కథేనా అనే అనుమానాలు వస్తున్నాయి ఇప్పుడు. ఏదేమైనా.. ఇద్దరు టాలెంటెడ్ ఆర్టిస్టులు కలిసి పనిచేస్తున్నారు. వారిద్దరినీ జంటగా చూడడం సినీ అభిమానులకు కనుల పండగే.