నాని లీగల్‌ ఫైట్‌: శ్రీరెడ్డి డోన్ట్‌ కేర్‌

మరిన్ని వార్తలు

నేచురల్‌ స్టార్‌ నాని లీగల్‌ ఫైట్‌కి దిగాడు. శ్రీరెడ్డికి లీగల్‌ నోటీసులు పంపాడు. సహనానికీ ఓ హద్దు వుందంటూ సోషల్‌ మీడియాలో శ్రీరెడ్డిని ఉద్దేశించి నాని ఓ ఆసక్తికరమైన పోస్టింగ్‌ పెట్టాడు. దీనంతటికీ కారణం, శ్రీరెడ్డి అత్యంత జుగుప్సాకరంగా నాని మీద సోషల్‌ మీడియాలో ఆరోపణలు చేస్తుండడమే. 

నాని తనతో లైంగిక చర్యలో పాల్గొన్నాడనీ, అతనికి డాగీ స్టైల్‌ అంటే ఇష్టమనీ శ్రీరెడ్డి సోషల్‌ మీడియాలో నిస్సిగ్గుగా అసభ్యకరమైన వ్యాఖ్యలు చేసింది. బిగ్‌ బాస్‌ రియాల్టీ షో కోసం శ్రీరెడ్డి పేరునీ నిర్వాహకులు పరిశీలించగా, నాని ఒత్తిడితో ఆ ప్రయత్నం నుంచి వారు విరమించుకోవాల్సి వచ్చిందట. ఇది కూడా శ్రీరెడ్డి నుంచి వచ్చిన ఆరోపణే. అయితే నిర్వాహకులు మాత్రం, ఎంతో మందిని అనుకుంటాం, కొన్ని కుదరవు.. ఈ విషయంలో నాని తప్పేమీ లేదని తేల్చేశారు. 

అవన్నీ పక్కన పెడితే, ఓ వ్యక్తిపై ఆరోపణలు చేసినప్పుడు, అందుకు తగ్గ ఆధారాలు చూపించాల్సి వుంటుంది. లీగల్‌ ఫైట్‌ చేస్తానంటూ గతంలో ప్రకటించిన శ్రీరెడ్డి, అప్పట్లో నానికి వ్యతిరేకంగా ఎలాంటి ఆధారాల్నీ పోలీసులకు చూపించలేదు. కానీ, నాని మీద ఆరోపణల పర్వం కొనసాగిస్తూ వచ్చింది. ఆరోపణల తీవ్రత జుగుప్సాకరంగా మారడంతో నాని చట్టపరమైన చర్యలకు దిగాల్సి వచ్చినట్లు తెలుస్తోంది. 

అయితే నాని లీగల్‌ ఫైట్‌ స్టార్ట్‌ చేసినా, శ్రీరెడ్డి లైట్‌ తీసుకుంది. చట్ట పరంగానే తేల్చుకుంటానంటూ సోషల్‌ మీడియాలో నానికి కౌంటర్‌ ఇచ్చింది. నాని పోస్ట్‌ చేసిన 'సహనం' ట్వీట్‌ని రీ-ట్వీట్‌ చేసింది శ్రీరెడ్డి. దాంతో ఈ వివాదం ఇప్పట్లో ముగిసేలా కన్పించడంలేదనీ, శ్రీరెడ్డి నుంచి మరింత జుగుప్సాకరమైన ఫైట్‌ తప్పదనీ అర్థమవుతోంది.

 


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS