నాని కథానాయకుడిగా `శ్యామ్ సింగరాయ్` రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఈరోజే.. ఈసినిమా క్లాప్ కొట్టుకుంది. `టక్ జగదీష్` పూర్తయిన వెంటనే ఈ చిత్రాన్ని సెట్స్‌పైకి తీసుకెళ్తారు. షూటింగ్ కి ఇంకా సమయం ఉంది. కాకపోతే.. ఇంత హడావుడిగా మొదలెట్టడానికి రెండు కారణాలున్నాయి. ఒకటి... ముందు రోజుల్లో మంచి ముహూర్తాలు లేవు. రెండోది.. `శ్యామ్ సింగరాయ్` ఆగిపోయిందన్న వార్తలు రావడం.
దాంతో.. హడావుడిగా ఈసినిమాకి శ్రీకారం చుట్టాల్సివచ్చింది. శ్యామ్ సింగరాయ్బడ్జెట్ భారీగా ఉందని, నానితో అంత బడ్జెట్ వర్కవుట్ అవ్వదని, అందుకే ఈసినిమాని నిర్మాతలు పక్కన పెట్టారని వార్తలొచ్చాయి. వాటికి ఖండించే క్రమంలోనే ఈసినిమాకి అర్జెంటుగా క్లాప్ కొట్టారని ప్రచారం మొదలెందిప్పుడు. ఏది ఏమైనా శ్యాం సింగరాయ్‌కి కొన్ని బడ్జెట్ సమస్యలు ఉన్నాయన్నది వాస్తవం. దర్శకుడు రాహుల్, నాని, ఇద్దరూ కూర్చుని బడ్జెట్ కి కత్తెర్లు వేశారని, ఇప్పుడు సేఫ్ బడ్జెట్ లోనే ఈ సినిమా పూర్తి చేయాలన్న నిర్ణయానికి వచ్చారని తెలుస్తోంది. బడ్జెట్ లో కోతలు జరిగాకే.. ఈ సినిమా మొదలైందని విశ్వసనీయ వర్గాల సమాచారం. ఏదైతేనేం.. నాని శ్యామ్ సింగరాయ్ గా కనిపించడం ఖాయమైంది. హ్యాపీనే కదా.