గాయని సునీత మళ్లీ పెళ్లి చేసుకోబోతోందంటూ కొన్ని రోజులు గా వార్తలు వస్తున్నాయి. ఇప్పుడు అదే నిజమైంది. సునీత మళ్లీ పెళ్లికి సిద్ధమైంది. ఈరోజే.. నిశ్చయ తాంబూలాలు సైతం తీసుకున్నారని తెలుస్తోంది. త్వరలోనే సునీత సింపుల్ గా పెళ్లి చేసుకోబోతోందట.
సునీతకు ఇది వరకే పెళ్లయ్యింది. ఇద్దరుపిల్లలు కూడా. అయితే.. కొన్ని కారణాల వల్ల మొదటి భర్తతో విడిపోయింది. ఆ తరవాతి నుంచి ఒంటరిగానే ఉంటోంది. ఆమధ్య సునీత మళ్లీ పెళ్లి చేసుకోబోతోందంటూ వార్తలొచ్చాయి. వాటిని సునీత ఖండిస్తూనే ఉంది. అయితే.. ఇప్పుడు మనసు మార్చుకుని మళ్లీ పెళ్లి పీటలపై కూర్చోబోతోంది. సునీతకు కాబోయే భర్త ఓ ఐటీ కంపెనీ యజమాని అని తెలుస్తోంది. ఆయనకూ ఇది రెండో పెళ్లే.