నాని శ్యామ్ సింగ రాయ్ షూటింగ్ డిసెంబర్ నుండి ప్రారంభం!

మరిన్ని వార్తలు

నాని వరుసగా ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్స్ చేస్తున్నాడు. అందులో శ్యామ్ సింగ రాయ్ ప్రేత్యేకం. టాక్సీవాల దర్శకుడు రాహుల్ సంకృత్యాన్ దర్శకత్వం వహిస్తున్నాడు. దర్శకుడు రాహుల్ ఆలోచనలకు తగ్గట్టు అత్యున్నత సాంకేతిక విలువలతో నిర్మాత వెంకట్ బోయనపల్లి ఈ సినిమాను నిర్మిస్తున్నారు.

 

నాని ఈ సినిమాలో ఒక కొత్తగా కనిపించబోతున్నాడు. నాని లుక్, డ్రెస్సింగ్ వైవిధ్యంగా ఉండబోతున్నాయి. చిత్ర యూనిట్ విడుదల చేసిన పోస్టర్ లో నాని డిఫరెంట్ లుక్ లో కనిపిస్తున్నాడు. హై బడ్జెట్, టెక్నికల్ వాల్యూస్ తో నిర్మిస్తున్న డిఫరెంట్ మూవీ ఇది. ట్యాలెంటెడ్ హీరోయిన్ సాయి పల్లవి, క్రితి శెట్టి ఈ సినిమాలో నాని సరసన నటించబోతున్నారు.

 

నీహారిక ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో ప్రొడక్షన్ నెంబర్ 1 గా తెరకెక్కుతున్న శ్యామ్ సింగ రాయ్ చిత్ర కథను సత్యదేవ్ జుంగా అందించడం జరిగింది. మెలోడీ సాంగ్స్ స్పెషలిస్ట్ మిక్కీ జె మేయర్ ఈ సినిమాకు స్వరాలు సమకూరుస్తున్నారు. అలాగే సాను జాన్ వర్గీస్ సినిమాటోగ్రఫీ అందిస్తోన్న ఈ సినిమాకు నవీన్ నూలి ఎడిటర్. టక్ జగదీష్ చిత్ర షూటింగ్ పూర్తి అయ్యాక నాని డిసెంబర్ నుండి శ్యామ్ సింగ రాయ్ షూటింగ్ లో పాల్గొనబోతున్నాడు.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS