నానికి సీరియస్ యాక్సిడెంట్ అనీ ఈ మధ్య అనేక గాసిప్స్ చక్కర్లు కొట్టాయి. అయితే తాజాగా జరిగిన 'అ' ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో నాని భేషుగ్గా కనిపించాడు. సో ఇంతవరకూ నాని యాక్సిడెంట్ చుట్టూ వచ్చిన గాసిప్స్ అన్నీ ఉత్తదే అని తేలిపోయాయి.
ఈ సంగతిలా ఉంచితే, నాని తొలిసారి నిర్మాతగా మారి రూపొందిస్తున్న సినిమా 'అ' తెలిసిన సంగతే. ఈ సినిమా మొదట్నుంచీ వావ్! అనిపించేలాగే ఇంట్రెస్ట్ క్రియేట్ చేస్తోంది. ఒక్కో పాత్ర పరిచయాన్ని ఒక్కో రకం ఇన్నోవేటివ్ థాట్‌తో డిజైన్ చేసి రిలీజ్ చేశారు. అక్కడే నాని బోలెడంత క్రెడిట్ కొట్టేశాడు. ట్రైలర్‌తో ఇక అందరి మనసుల్ని దోచేశాడు. భారీ కాస్టింగ్‌తో రూపొందిన సినిమా ఇది. అలాగే ప్రీ రిలీజ్ ఈవెంట్‌ని కూడా భారీగానే ప్లాన్ చేశారు. చాలా రిచ్‌లుక్‌తో ఈవెంట్ సాగింది.
ఇక ఈ ఈవెంట్ ఏమీ ఆషామాషీగా జరగలేదండోయ్. సినిమాలో కాస్టింగ్ లిస్ట్ పెద్దదేనన్న సంగతి తెలిసిందే. అలాగే ఈవెంట్‌కి విచ్చేసిన కాస్టింగ్ లిస్ట్ కూడా అంతన్నా భారీనే. ఇండస్ట్రీలోని టాప్ మోస్ట్ పర్సన్స్ అందర్నీ ఈ ఈవెంట్‌కి ఆహ్వానించాడు నాని. గ్రేట్ డైరెక్టర్స్ రాజమౌళి, రాఘవేంద్రరావు, టాప్ హీరోయిన్ అనుష్క తదితర సినీ ప్రముఖులు హాజరయ్యారు. సినిమాని ప్రమోట్ చేయడంలో నాని చాలా కేర్ తీసుకుంటున్నాడు. విడుదలకు ముందే సినిమా చూసేయ్యాలన్న ఆత్రంతో ఉన్నాననీ రాజమౌళి చెప్పడం విశేషం.
సినిమా ఇండస్ట్రీ నాకు చాలా ఇచ్చింది. అలాంటి ఇండస్ట్రీకి తానేం ఇవ్వగలను అన్న ఆలోచనతోనే, ఈ సినిమా నిర్మాణానికి ముందుకొచ్చాననీ నాని అన్నాడు. ఫిబ్రవరి 16న 'అ' ప్రేక్షకుల ముందుకు రానుంది.