మాస్‌ రాజా జోరు మొదలైందిలే!

మరిన్ని వార్తలు

మాస్‌ రాజా రవితేజ అంటే ఏడాదికి మూడు సినిమాలు, మినిమమ్‌ గ్యారంటీ, ఫ్యాన్స్‌కి పండగ. ఇలా ఉండేది. అలాంటిది దాదాపు గత రెండేళ్లుగా రవితేజ నుండి ఒక్క సినిమా కూడా రాకపోవడంతో ఫ్యాన్స్‌ బాగా డిజప్పాయింట్‌ అయిపోయారు. అలాంటిది 2017లో మాస్‌ రాజా సర్‌ప్రైజింగ్‌ ఎంట్రీ ఇచ్చి, ఒకేసారి రెండు సినిమాలు అనౌన్స్‌ చేసి, ఫ్యాన్స్‌లో మళ్లీ హుషారు తెప్పించాడు. 

'రాజా ది గ్రేట్‌' సినిమాతో రీ ఎంట్రీలో ప్రయోగం చేసి ఎప్పటిలాగే హిట్‌ కొట్టి, దటీజ్‌ మాస్‌ రాజా అనిపించుకున్నాడు 2017లో. ఫ్యాన్స్‌లో ఆ జోరు అలాగే కొనసాగేందుకు ఈ ఏడాది ప్రధమార్ధంలోనే మళ్లీ ఇంకో సినిమాతో వచ్చేస్తున్నాడు. అదే 'టచ్‌ చేసి చూడు'. ఈ సినిమా ప్రోమోస్‌ ఇప్పటికే ఎట్రాక్ట్‌ చేస్తున్నాయి. రవితేజ పోలీస్‌ పాత్రలో నవ్వులు పూయించడానికి వచ్చేస్తున్నాడు 'టచ్‌ చేసి చూడు' సినిమాతో. విక్రమ్‌ సిరికొండ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కింది. మరో రెండు రోజుల్లో ప్రేక్షకుల మందుకు రానుంది ఈ సినిమా. రాశీఖన్నా, సీరత్‌కపూర్‌ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ సినిమాలో రవితేజ సరికొత్త లుక్‌లో క్లాస్‌ టచ్‌ ఉన్న మాస్‌ హీరోలా కనిపిస్తున్నాడు. 

ఈ సినిమా సంగతి పక్కన పెడితే, రవితేజ స్పీడు ఇంతటితో ఆగిపోలేదు. శ్రీను వైట్లతో రవితేజ ఓ సినిమాకి కమిట్‌ అయ్యాడన్న సంగతి విదితమే. ఈ ఇద్దరిదీ సూపర్బ్‌ కాంబినేషన్‌. గతంలో 'వెంకీ','దుబాయ్‌ శీను' తదితర చిత్రాలు ఈ కాంబినేషన్‌లో వచ్చి సక్సెస్‌ అయ్యాయి. అయితే ఈ కాంబోలో సినిమా ఎప్పటి నుండో ప్రచారం జరుగుతోంది. దానికి 'అమర్‌ అక్బర్‌ ఆంటోనీ' అనే టైటిల్‌ కూడా అనుకుంటున్నారు. ఆ సినిమా ఇప్పుడు వెలుగులోకి వచ్చింది. త్వరలోనే ఈ ప్రాజెక్ట్‌ పట్టాలెక్కనుందట. సక్సెస్‌ఫుల్‌ బ్యానర్‌ అయిన మైత్రీ మూవీ మేకర్స్‌ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మించనుంది.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS