'అరవింద' ప్యాకప్‌ అయిపోయింది

By iQlikMovies - June 08, 2018 - 11:47 AM IST

మరిన్ని వార్తలు

ఎన్టీఆర్‌ - త్రివిక్రమ్‌ కాంబినేషన్‌లో తెరకెక్కుతోన్న చిత్రానికి 'అరవింద సమేత వీర రాఘవ' టైటిల్‌ని ఫిక్స్‌ చేసిన సంగతి తెలిసిందే. ఈ సినిమాలో పూజా హెగ్దే టైటిల్‌లోని 'అరవింద' పాత్రను పోషిస్తుండగా, 'రాఘవ' పాత్రలో ఎన్టీఆర్‌ కనిపిస్తున్నాడు. టైటిల్‌ పరంగా చూస్తే, ఈ సినిమాలో పూజా హెగ్దే పాత్రకు ఎక్కువ ఇంపార్టెన్స్‌ ఉన్నట్లు తెలుస్తోంది. 

ఇకపోతే తాజాగా ఈ సినిమాలో పూజా హెగ్దే పాత్ర చిత్రీకరణ పూర్తయిపోయిందట. ఈ విషయాన్ని పూజా హెగ్దే ట్విట్టర్‌ ద్వారా అభిమానులతో పంచుకుంది. షూటింగ్‌ ఉన్నంత వరకూ సెట్స్‌లో చాలా హ్యాపీగా గడిపాననీ, సెట్స్‌ నుండి వెళ్లాలంటే కొంచెం ఫీలవుతున్నాననీ పూజా హెగ్దే చెప్పింది. దసరాకి ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాలో ఎన్టీఆర్‌ సిక్స్‌ప్యాక్‌తో స్లిమ్‌ అండ్‌ హ్యాండ్‌సమ్‌గా కనిపించనున్నాడు. 

ఇదిలా ఉంటే, ఇప్పుడు టాలీవుడ్‌లో మోస్ట్‌ వాంటెడ్‌ హీరోయిన్‌ పూజా హెగ్దే. ఆమె చేతిలో వరసగా స్టార్‌ హీరోల సినిమాలే ఉన్నాయి. ఎన్టీఆర్‌ సినిమా నుండి ప్యాకప్‌ అయిన పూజా హెగ్దే నెక్ట్స్‌ సూపర్‌స్టార్‌ మహేష్‌బాబు సినిమా కోసం సిద్దంగా ఉంది. వంశీ పైడిపల్లి దర్శకత్వంలో సూపర్‌స్టార్‌ మహేష్‌బాబు హీరోగా తెరకెక్కుతోన్న ఈ సినిమాకి 'రాజసం' అనే టైటిల్‌ని అనుకుంటున్నారు. ఈ సినిమాలోనే సూపర్‌స్టార్‌ న్యూ లుక్‌తో కనిపించనున్నాడు. అతి త్వరలో సెట్స్‌ మీదికెళ్లనుందీ సినిమా. 

ఇది కాక పూజా హెగ్దే ప్రబాస్‌తోనూ ఓ సినిమాలో నటిస్తోంది. 'జిల్‌' ఫేం రాధాకృష్ణ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS