హీరో విక్రమ్ కుమారుడి పైన పోలీసు కేసు నమోదు

By iQlikMovies - August 12, 2018 - 13:38 PM IST

మరిన్ని వార్తలు

హీరో విక్రమ్ కుమారుడు ద్రువ్ త్వరలోనే హీరోగా వెండితెరకు పరిచయం కానున్న సంగతి విదితమే.

అయితే హీరోగా ఎంట్రీ ఇవ్వకముందే అతను వార్తల్లో వ్యక్తిగా నిలిచాడు. ఇంతకి ఆ వార్త ఏంటంటే- ఈరోజు తెల్లవారుజామున చెన్నైలో అతను ప్రయాణిస్తున్న కారు అదుపు తప్పి రోడ్డు పక్కన నిలిపి ఉన్న మూడు ఆటోలపైకి దూసుకెళ్ళింది.

ఈ ఘటనలో ఒక ఆటో డ్రైవర్ కాలికి గాయమైంది. వెంటనే అక్కడికి చేరుకున్న పోలీసులు ప్రమాధానికి కారణమైన కారుని సీజ్ చేయడంతో పాటుగా ద్రువ్ పైన కేసు కూడా నమోదు చేశారు. ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘన సెక్షన్స్ క్రింద కేసు నమోదు చేశారు.

ఈ అంశం పై హీరో విక్రమ్ ఇంకా స్పందించలేదు. ద్రువ్ ప్రస్తుతం అర్జున్ రెడ్డి చిత్రం తమిళ రీమేక్ అయిన వర్మలో నటిస్తున్నాడు.

 


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS