మళ్లీ ప్రయోగానికే కాలు దువ్వుతోన్న నాని?

By iQlikMovies - August 18, 2019 - 10:00 AM IST

మరిన్ని వార్తలు

ఇటీవల 'జెర్సీ'లో 36 ఏళ్ల క్రికెటర్‌గా కనిపించి హిట్‌ కొట్టాడు. త్వరలో ఇంద్రగంటి మోహన్‌కృష్ణ సినిమా కోసం విలన్‌ అవతారమెత్తబోతున్నాడు. ఇక తాజాగా ఇంకో ప్రయోగానికి సిద్ధపడుతున్నట్లు లేటెస్ట్‌గా ప్రచారం జరుగుతోంది. ఓ బాలీవుడ్‌ బ్లాక్‌ బస్టర్‌ని నాని రీమేక్‌ చేయాలనుకుంటున్నాడనీ తెలుస్తోంది. ఆయుష్మాన్‌ ఖురానా హీరోగా ఇటీవల ప్రేక్షకుల ముందుకొచ్చి, బ్లాక్‌ బస్టర్‌ హిట్‌ అందుకున్న 'అంధాదున్‌' చిత్రాన్ని సౌత్‌లో రీమేక్‌ చేసేందుకు గత కొంతకాలంగా సన్నాహాలు జరుగుతున్నాయి.

 

ఆ క్రమంలో ఆల్రెడీ తమిళంలో ఈ సినిమాకి రంగం సిద్ధమైంది. సీనియర్‌ హీరో ప్రశాంత్‌ ప్రధాన పాత్రలో కోలీవుడ్‌లో ఈ సినిమా రీమేక్‌ అవుతోంది. అయితే, తెలుగులో కూడా ఈ సినిమా రీమేక్‌ చేసేందుకు కొందరు నిర్మాతలతో కలిసి నేచురల్‌ స్టార్‌ నాని సిద్ధపడుతున్నాడనీ తెలుస్తోంది. ఈ సినిమాకి నాని నిర్మాణ భాగస్వామ్యం వహించే అవకాశాలున్నాయనీ తాజా సమాచారం. అయితే నానికి ఈ స్టోరీ వర్కవుట్‌ అవుతుందా.? లేదా.? అనేది చూడాలి. అంధుడి పాత్రలో పలువురు హీరోలు ఇప్పటికే మెప్పించారు.

 

ఆ క్రమంలో నేచురల్‌ స్టార్‌ నాని, తన నేచురల్‌ టాలెంట్‌ని ఎంత వరకూ ఉపయోగిస్తాడో తెలియాలంటే, ఈ ప్రాజెక్ట్‌ కన్‌ఫామేషన్‌ కోసం ఎదురు చూడాల్సిందే. మరోవైపు నాని నటించిన 'జెర్సీ' సినిమాని రీమేక్‌ చేసేందుకు బాలీవుడ్‌లోనూ పెద్ద ఎత్తున చర్చలు జరుగుతున్నాయి. ఓ స్టార్‌ హీరోతో ఈ సినిమాని రీమేక్‌ చేసేందుకు ప్రముఖ ప్రొడ్యూసర్‌ ప్లాన్‌ చేస్తున్నాడక్కడ.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS