అప్పుడు చేపగా, ఇప్పుడు బేబీ సింగంలా నాని!

మరిన్ని వార్తలు

నేచురల్‌ స్టార్‌ నాని సింహం అవతారమెత్తారా.? అంటే అవుననే చెప్పాలి. అయితే, సింహంలా నాని కనిపించడు. వినిపిస్తాడు. ఆ.. సరిగ్గా అదే అప్పుడు 'అ' సినిమాలో నాని ఓ చేపకి గొంతును అరువిచ్చాడు కదా. అలాగే ఇప్పుడు ఓ సింహం పిల్లకి తన గొంతును అరువిచ్చాడు. ప్రఖ్యాత నిర్మాణ సంస్థ వాల్‌ డిస్నీ స్టూడియోస్‌ నిర్మిస్తున్న 'ది లయన్‌ కింగ్‌' చిత్రాన్ని హిందీతో పాటు, తమిళ, తెలుగు భాషల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సంగతి తెలిసిందే.

 

ఇందులో రకరకాల జంతువులు మనుషుల్లాగే మాట్లాడుకుంటాయి. జంతువులు కదా వాటి భాష మనకు అర్ధం కాదు కదా. అందుకే ఆయా జంతువులకు మన హీరోలు, కమెడియన్లు తమ తమ గొంతును అరువిచ్చారు మన ఆడియన్స్‌ కోసం. ఇందులో ముఫాసా అనే సింహం హీరో. ఈ హీరో సింహం పాత్రకు తెలుగు వెర్షన్‌లో సాయి కుమార్‌ సోదరుడు రవిశంకర్‌ డబ్బింగ్‌ చెప్పగా, ఆ పెద్ద సింహానికి ఇంకో బుల్లి సింహం ఉంది. దాని పేరు 'సింబా' ఈ సింబా క్యారెక్టర్‌కి మన నాని తన గొంతును అరువిచ్చారు.

 

ఈ సినిమాలో 'పుంబా' అనే అడవి పంది పాత్రకు బ్రహ్మానందం, 'టిమోన్‌' అనే ముంగిస పాత్రకు అలీ, విలన్‌ 'స్కార్‌' పాత్రకు జగపతిబాబు డబ్బింగ్‌ చెప్పారు. తమిళ వెర్షన్‌లో ముఫాసా, స్కార్‌ పాత్రలకు సిద్ధార్ద్‌, అరవింద్‌ స్వామి, హిందీలో ముఫాసా పాత్రకు షారూఖ్‌ఖాన్‌, సింబా పాత్రకు ఆయన తనయుడు ఆర్యన్‌ డబ్బింగ్‌ చెప్పారు. జూలై 19న వరల్డ్‌ వైడ్‌గా 'ది లయన్‌ కింగ్‌' ప్రేక్షకుల ముందుకు రానుంది.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS