నాని పాత్రకు ఆ డిజార్డర్ సెట్ చేసిన శివ నిర్వాణ

By iQlikMovies - August 10, 2020 - 10:31 AM IST

మరిన్ని వార్తలు

నేచురల్ స్టార్ నాని ప్రస్తుతం శివ నిర్మాణ దర్శకత్వంలో 'టక్ జగదీష్' అనే చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. 'నిన్ను కోరి' తర్వాత నాని - శివ నిర్వాణ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న సినిమా ఇది. ఎమోషనల్ టచ్ ఉండే ఎంటర్టైనర్ సినిమాలు తెరకెక్కించడంలో శివ నిర్వాణ అది ఒక ప్రత్యేకమైన శైలి. ఈ సినిమాలో కూడా ఎమోషన్స్ బలంగా ఉంటాయట.

ఈ సినిమాలో నాని పాత్ర బైపోలార్ డిజార్డర్ తో బాధపడుతూ ఉంటుందని సమాచారం. ఈ బైపోలార్ డిజార్డర్ తో బాధపడే వ్యక్తులు సంతోషం వచ్చినా బాధ కలిగినా వాటిని సాధారణ వ్యక్తుల కంటే అధికంగా వ్యక్తపరుస్తారు. ఇలాంటి మనస్తత్వంతో హీరో ఎటువంటి ఇబ్బందులు ఎదుర్కొన్నాడు? తన ప్రేమలో ఆ డిసార్డర్ ఏ విధంగా అడ్డంకిగా మారింది అనేది ఈ సినిమాలో ప్రధానంగా ఉంటుందట. ఇలాంటి ఛాలెంజింగ్ పాత్ర దొరికితే హీరో నాని చెలరేగి పోతాడు అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు.

ఈ సినిమాలో రీతూవర్మ, ఐశ్వర్య రాజేష్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. తమన్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రానికి సాహు గారపాటి,  హరీష్ పెద్ది నిర్మాతలు.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS