సర్కారు వారి పాటకు సినిమాటోగ్రాఫర్ ఛేంజ్

By iQlikMovies - August 10, 2020 - 10:19 AM IST

మరిన్ని వార్తలు

సూపర్ స్టార్ మహేష్ బాబు త్వరలో పరశురామ్ దర్శకత్వంలో 'సర్కారు వారి పాట' సినిమాలో నటించబోతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ప్రీప్రొడక్షన్ జోరుగా సాగుతున్న ఈ చిత్రానికి మరో రెండు నెలల్లో రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుంది. ఇదిలా ఉంటే తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఒక కీలక టెక్నీషియన్ మారిపోయారని సమాచారం.

ఈ సినిమాకు మొదట పి.ఎస్.వినోద్ ను సినిమాటోగ్రాఫర్ గా ఎంచుకున్నారు. అయితే ఇతర కమిట్ మెంట్ల కారణంగా డేట్స్ క్లాష్ వస్తోందని ఆయన సినిమా నుంచి తప్పుకున్నారు. దీంతో ఆయన స్థానంలో R మది ని  సినిమాటోగ్రాఫర్ గా ఎంచుకున్నారు. మది గతంలో పలు విజయవంతమైన చిత్రాలకు సినిమాటోగ్రాఫర్ గా పని చేశారు. మహేష్ బాబు 'శ్రీమంతుడు' చిత్రానికి ఆయనే సినిమాటోగ్రాఫర్.

ఈ సినిమాలో మహేష్ బాబు సరసన కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తోంది. తమన్ ఈ చిత్రానికి సంగీత దర్శకుడు. మైత్రి మూవీ మేకర్స్, 14 రీల్స్ ప్లస్,  జి.ఎం.బి ఎంటర్టైన్మెంట్స్ ఈ సినిమాను సంయుక్తంగా నిర్మిస్తున్నారు.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS