నాని నిర్మాతగా మారి రూపొందిస్తున్న సినిమా 'అ'. ఈ చిత్రం ఫిబ్రవరిలో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇదో డిఫరెంట్ కాన్సెప్ట్ మూవీ. రెగ్యులర్ చిత్రాలకు అత్యంత భిన్నంగా తెరకెక్కుతోన్న సినిమా ఇది. మొదట్లో చిన్న సినిమా అనుకున్న ఈ సినిమా రాను రాను హెవీ ఇంట్రెస్ట్ క్రియేట్ చేసి, పెద్ద సినిమాల లిస్టులోకి చేరిపోయింది. భారీ కాస్టింగ్‌తో ఇదేదో భారీ చిత్రమే అనే ఫీలింగ్ కలిగిస్తోంది. అయితే ఇంత భారీ కాస్టింగ్ ఈ చిత్రానికి సెట్ అవడానికి కారణం నానినే అని చెప్పక తప్పదు.
ఇంతమంది నటీనటులు ఈ సినిమాలో కనిపించనున్నారంటే, అదంతా నాని వల్లే సాధ్యమైందని అనుకోవచ్చు. అయితే ఈ సినిమాకి నాని కేవలం సమర్పకుడు మాత్రమే. ప్రశాంత్ వర్మ ఈ సినిమాకి దర్శకుడు. ఇదిలా ఉండగా ఈ ఏడాది నాని మరో ఇంట్రెస్టింగ్ అండ్ క్రేజీ ప్రాజెక్ట్‌ను చేపట్టబోతున్నాడట. ఈ ప్రాజెక్ట్‌కి నాని పూర్తి స్థాయిలో నిర్మాతగా వ్యవహరించనున్నాడట. ఈ ప్రాజెక్ట్ ఈ ఏడాది సెకండాఫ్‌లో పట్టాలెక్కనుందట. థీమ్ నచ్చి ఈ సినిమాని తానే ప్రొడ్యూస్ చేయాలనుకుంటున్నాడట నాని. ఈ చిత్రంలో నానినే హీరోగా నటిస్తాడనీ సమాచారమ్.
గతేడాది నాని హీరోగా 'నేను లోకల్', 'నిన్ను కోరి', 'ఎంసీఏ' చిత్రాలతో వరుస హిట్లు కొట్టి, హ్యాట్రిక్ హీరో అనిపించుకున్నాడు. ఈ ఏడాది నిర్మాతగా 'అ' చిత్రంతో బోనీ కొట్టనున్నాడు. మరో పక్క హీరోగా 'కృష్ణార్జున యుద్దం' సినిమా షూటింగ్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. రేపో మాపో ఈ సినిమాతో మళ్లీ నాని ప్రేక్షకుల ముందుకు వచ్చేస్తాడు. ఇవన్నీ కాక, నాగార్జునతో ఓ మల్టీ స్టారర్ చిత్రంలో నటిస్తున్నాడు నాని. మొత్తానికి ఏడాదికి ఖచ్చితంగా మూడు సినిమాలు, వీలైతే నాలుగు సినిమాలతో ఫ్యాన్స్‌ని ఎంటర్టైన్ చేయాలన్న టార్గెట్ ఈ ఏడాది కూడా కంటిన్యూ అయ్యేటట్లే ఉంది ఈ రకంగా నాని జోరు చూస్తుంటే.