పాన్ ఇండియా కథల కోసం హీరోలు అన్వేషిస్తున్నారు. ఎందుకంటే ఈమధ్య ఏ హీరో ని చూసినా `పాన్ ఇండియా సినిమా` అంటూ ఆ జపం చేస్తూ కనిపిస్తున్నాడు. స్టార్ హీరోలే కాదు, కుర్ర హీరోలూఐ.. పాన్ ఇండియా ప్రాజెక్టులవైపు దృష్టి సారిస్తున్నారు. కాబట్టి... ఆ తరహా కథల కోసం వేట మొదలైంది. స్పోర్ట్స్ నేపథ్యంలో సినిమా ఎంచుకుంటే.. కచ్చితంగా దానికి పాన్ ఇండియా మైలేజీ ఉంటుంది. అందుకే స్పోర్ట్స్ డ్రామాలకు గిరాకీ ఏర్పడింది.
తాజాగా నాని దగ్గరకు ఓ స్పోర్ట్స్ డ్రామా వెళ్లిందని టాక్. ఆ కథ... ఫుట్ బాల్ నేపథ్యంలో సాగబోతోందట. ఈ సినిమాని పాన్ ఇండియా స్థాయిలో చేయాలని నాని భావిస్తున్నాడు. దర్శకుడు ఎవరు? నిర్మాణ సంస్థ తదితర వివరాలు త్వరలో వెల్లడవుతాయి. ఇది వరకు `జెర్సీ`తో క్రికెట్ నేపథ్యంలో సాగే కథని ఎంచుకున్నాడు నాని. ఆ సినిమా సూపర్ హిట్టయ్యింది. అంతే కాదు... బాలీవుడ్ లోనూ తెరకెక్కుతోంది. మరి ఈ ఫుట్ బాల్ సినిమా ఏ స్థాయికి వెళ్తుందో?