ఇంద్రగంటి మోహనకృష్ణ దర్శకత్వంలో నాచురల్ స్టార్ నాని, సుధీర్ బాబు హీరోలుగా నటించిన చిత్రం 'V'. ఈ సినిమాను శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు నిర్మించారు. ఈ సినిమా నిజానికి వేసవిలోనే విడుదల కావాల్సి ఉన్నప్పటికీ కరోనా వైరస్ కారణంగా థియేటర్లు మూత పడటంతో రిలీజ్ చేయలేకపోయారు. ఎంత ఆలస్యం అయినా థియేటర్లలోనే రిలీజ్ చేస్తారని మొదట్లో వార్తలు వచ్చాయి కానీ ఇప్పుడు మాత్రం ఈ సినిమాను ఓటిటి వేదికల ద్వారా రిలీజ్ చేసేందుకు రంగం సిద్ధమైంది.
ఇప్పటికే నిర్మాత దిల్ రాజు ఈ సినిమా డిజిటల్ రిలీజ్ రైట్స్ ను అమెజాన్ ప్రైమ్ వీడియో కు అమ్మినట్టు సమాచారం. ఈ సినిమాను సెప్టెంబర్ 5న రిలీజ్ చేసేందుకు అమెజాన్ ప్రైమ్ వీడియో వారు సన్నాహాలు చేస్తున్నారట. థియేటర్లు మూత పడిన తర్వాత పలు తెలుగు చిత్రాలు ఓటీటీ వేదికల ద్వారా విడుదలయ్యాయి కానీ అవన్నీ చిన్న సినిమాలే. 'V' లాంటి మీడియం రేంజ్ చిత్రం డైరెక్ట్ గా ఓటీటీలో విడుదల కావడం తొలిసారి కాబట్టి ఈ సినిమాకు భారీగా ఆదరణ దక్కే అవకాశముంది.
ఈ సినిమాలో అదితి రావు, హైదరి నివేదా థామస్ హీరోయిన్లుగా నటించారు. ఈ సినిమాకు ఇంద్రగంటి మోహన కృష్ణ దర్శకుడు.