ఫ్లాష్ బ్యాక్ ట్విస్ట్ అదేనా?

By Gowthami - June 27, 2020 - 12:36 PM IST

మరిన్ని వార్తలు

నాని - సుధీర్ బాబు కాంబినేష‌న్‌లో రూపొందిన చిత్రం `వి`. ఇంద్ర‌గంటి మోహ‌న కృష్ణ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ చిత్రాన్ని దిల్ రాజు నిర్మించారు. ఉగాదిన విడుద‌ల కావాల్సిన సినిమా ఇది. లాక్ డౌన్ వ‌ల్ల నిర‌వ‌ధికంగా వాయిదా ప‌డింది. ఈ చిత్రంలో సుధీర్ బాబు పోలీస్ ఆఫీస‌ర్‌గా న‌టిస్తే, నాని ప్ర‌తినాయ‌కుడిగా క‌నిపిస్తున్న విష‌యం తెలిసిందే.

 

అయితే ఈ సినిమా ఫ్లాష్ బ్యాక్‌లో నాని.. ఆర్మీ మేజ‌ర్ గా క‌నిపించ‌బోతున్నాడ‌ట‌. ప‌ది నిమిషాల ఈ ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ ఈ సినిమా మొత్తానికి హైలెట్ గా నిలుస్తుంద‌ని టాక్‌. నాని విల‌న్‌గా మార‌డానికి కార‌ణం.. ఈ ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ అని తెలుస్తోంది. ఆ ఫ్లాష్ బ్యాక్ ఎంత పండితే, ఈసినిమా అంత పెద్ద హిట్ అవుతుంద‌ని చిత్ర‌బృందం ఆశిస్తోంది. నాని ఆర్మీ ఆఫీస‌ర్‌గా కనిపించ‌డం ఇదే తొలిసారి. మ‌రి ఆ పాత్ర‌లో నాని ఏ మేర‌కు రాణించాడ తెలియాలంటే ఇంకొన్ని రోజులు ఆగాలి.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS