నాని - విక్రమ్ కె.కుమార్ కాంబినేషన్లో ఓ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. మైత్రీ మూవీస్ నిర్మిస్తోంది. దీనికి 'గ్యాంగ్ లీడర్' అనే పేరు కూడా పెట్టారు. ప్రస్తుతం హైదరాబాద్లో శరవేగంగా షూటింగ్ జరుగుతోంది. అయితే ఈ సినిమా టైటిల్లో మార్పులు వచ్చే అవకాశం ఉన్నట్టు టాక్. నాని సినిమాకంటే ముందు మరో నిర్మాత 'గ్యాంగ్ లీడర్' అనే టైటిల్ రిజిస్టర్ చేయించుకున్నాడు. అందుకు సంబంధించిన షూటింగ్ కూడా మొదలైంది. సదరు నిర్మాత 'గ్యాంగ్ లీడర్' టైటిల్ నాదే.. అంటూ పట్టుపట్టుకుని కూర్చున్నాడట.
ఈ విషయం సెటిల్ చేయాలని మైత్రీ మూవీస్ గట్టిగానే ప్రయత్నాలు ప్రారంభించింది. దాదాపు 50 లక్షలు ఆఫర్ చేసిందట. కానీ... అవతలివైపు వాళ్లు మాత్రం 'టైటిల్ ఇవ్వంగాక ఇవ్వం' అంటూ పట్టుపట్టారట. దాంతో ఈ టైటిల్ మారే సూచనలు ఉన్నాయని తెలుస్తోంది. 'నాని గ్యాంగ్ లీడర్', 'న్యూ గ్యాంగ్ లీడర్'. 'గ్యాంగ్ లీడర్ 2019' అంటూ... రెండు మూడు ప్రత్యామ్నాయాలు ఆలోచిస్తున్నారు. ఇందులో ఏదో ఒకటి ఖాయం అవ్వొచ్చు.