నాని సినిమా అనగానే బిజినెస్ వర్గాల్లో ఆసక్తి మొదలైపోతుంది. తన సినిమా ఎప్పుడూ హాట్ కేకే. ప్రస్తుతం 'జెర్సీ'కీ మంచి బిజినెస్సే జరిగింది. శుక్రవారం ఈ చిత్రం విడుదల అవుతున్న సంగతి తెలిసిందే. ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమా థియేటర్ రైట్స్ రూ.26 కోట్లకు అమ్ముడుపోయాయి. నైజాంలో ఏకంగా రూ.10 కోట్ల బిజినెస్ జరిగింది. ఓవర్సీస్‌లో 4 కోట్లకు అమ్మారు. సీడెడ్‌లో రూ.3.20 లక్షలకు `జెర్సీ`ని కొనుక్కున్నారు.
రెస్టాఫ్ ఇండియా రైట్స్ రూ.2 కోట్లు పలికాయి. శాటిలైట్, హిందీ డబ్బింగ్ రైట్స్ కలిపి దాదాపు 12 కోట్ల వరకూ వచ్చాయి. అంటే.. 38 కోట్లతో బిజినెస్ పూర్తయ్యిందన్నమాట. ఇది టేబుల్ ప్రాఫిట్ సినిమా. 19న 'జెర్సీ'తో పాటు 'కాంచన 3' కూడా వస్తోంది. కాంచన ఎఫెక్ట్ బీ,సీ సెంటర్లలో బాగా ఉండొచ్చు. ఈనెలలో విడుదలైన మజిలీ, చిత్రలహరికి ఇంకా వసూళ్లు బాగానే ఉన్నాయి. జెర్సీకి ఈ మూడు సినిమాల నుంచి గట్టి పోటీ ఎదురయ్యే ఛాన్సుంది.