నాని చేతిలో ఎప్పుడూ నాలుగైదు సినిమాలుంటాయి. యేడాదికి రెండు మూడు సినిమాల్ని రిలీజ్‌కి సిద్దం చేయడం తన అలవాటు. ఇప్పుడూ అదే ఆనవాయితీ కొనసాగిస్తున్నాడు. ప్రస్తుతం `టక్ జగదీష్` సినిమాతో బిజీగా ఉన్నాడు నాని. ఆ తరవాత.. `శ్యామ్ సింగరాయ్` ఉంటుంది. ఇది పూర్తయ్యాక వివేక్ ఆత్రేయతో సినిమా మొదలవుతుంది. `మెంటల్ మదిలో`, `బ్రోచేవారెవరురా` సినిమాలతో ఆకట్టుకున్నాడు వివేక్ ఆత్రేయ. అందుకే నానితో సినిమా చేసే ఛాన్స్ వచ్చింది.
ఈ సినిమాకి సంబంధించిన స్క్రిప్టు పనులు మొదలైపోయాయని టాక్. దాంతో పాటు రెండు మూడు టైటిళ్లూ పక్కన పెట్టుకున్నారట. `అంటే... సుందరానికి`, `సుందరానికి తొందరెక్కువ` టైటిళ్లు ఈ సినిమా కోసం రిజిస్టర్ చేశారని సమాచారం. వీటిలో ఒకటి ఫిక్స్ చేసే అవకాశం ఉంది. ఇదో రొమాంటిక్ కామెడీ డ్రామా అని, నాని సుందరంగా కనిపించనున్నాడని తెలుస్తోంది. నాని పాత్రని బట్టే ఈ టైటిళ్లు ఎంచుకున్నారట. మరి.. ఇందులో దేన్ని ఖరారు చేస్తారో మరి?!