మెగా ప్రిన్స్ వరుణ్‌తేజ్ - సంకల్ప్ రెడ్డి దర్శకత్వంలో సినిమా తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. స్పేస్ నేపథ్యంలో తెరకెక్కుతోన్న ఈ సినిమాకి 'అంతరిక్షం' అనే టైటిల్‌ని పరిశీలిస్తున్నారు. కాగా ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. వెరీ లేటెస్టుగా ఓ ఫ్రెష్ షెడ్యూల్‌ని కంప్లీట్ చేసుకున్న ఈ చిత్రం ఔట్‌పుట్ అనుకున్న దాని కన్నా చాలా బాగా వచ్చిందట.
ఇంతవరకూ తెలుగు సినీ తెరపై ఇలాంటి కాన్సెప్ట్‌తో సినిమా వచ్చింది లేదు. అంతరిక్షం నేపథ్యం అంటే, జీరో గ్రావిటీని చూపించాలి. గాల్లో తేలాల్సిందే. నటీనటులు గాల్లో తేలుతున్నట్లుగా కనిపించేలా చిత్రీకరించడానికి చిత్ర యూనిట్ చాలా చాలా కష్టపడాల్సి వచ్చిందట. అందుకోసం డైరెక్టర్ చాలా క్రియేటివిటీని యూజ్ చేశాడట. హైద్రాబాద్ శివార్లలో ప్రత్యేకంగా వేసిన సెట్‌లో ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ జరుగుతోంది.
ఈ సినిమాకి పని చేసిన ప్రతీ ఒక్కరికీ సరికొత్త ఫీలింగ్ కలుగుతోందట. నిజంగా స్పేస్‌లో ఉన్నామనే భావనలో నటిస్తుండడం కొత్త కిక్కిస్తోందని అంటున్నారు. సినిమా చూసిన ప్రేక్షకులకీ అదే థ్రిల్ కల్గించడం ఖాయమంటున్నారు. లేటెస్టుగా షూట్ చేసిన షాట్స్‌లో మెగా ప్రిన్స్‌తో పాటు, హీరోయిన్ అదితీరావ్ హైదరీ కూడా పాల్గొంది.
సినిమాకి అతి కీలకమైన సన్నివేశాలు ఈ షాట్‌లో చిత్రీకరించారనీ విశ్వసనీయ వర్గాల సమాచారమ్. ఇకపోతే 'ఫిదా', 'తొలిప్రేమ' వంటి క్యూట్ రొమాంటిక్ సినిమాల తర్వాత వరుణ్ తేజ్ నటిస్తున్న ప్రయోగాత్మక చిత్రమిది. ఈ సినిమాలో అదితీతో పాటు మరో ముద్దుగుమ్మ లావణ్య త్రిపాఠి కూడా ఓ ఇంపార్టెంట్ రోల్ పోషిస్తోంది.