లుక్స్‌తో అదరగొట్టేస్తున్న సుధీర్‌బాబు

మరిన్ని వార్తలు

'సమ్మోహనం' సినిమాతో ఇటీవలే అందర్నీ హిప్నటైజ్‌ చేసిన సుధీర్‌బాబు మరో చిత్రం లైన్‌లోకి వచ్చేసింది. ఇంకా 'సమ్మోహనం' ఎఫెక్ట్‌ నుండి తేరుకోకుండానే సుధీర్‌బాబు మరో సర్‌ప్రైజ్‌ ఇచ్చాడు. తన తదుపరి చిత్రం ఫస్ట్‌లుక్‌ రిలీజ్‌ చేశాడు. సినిమా టైటిల్‌ 'నన్ను దోచుకుందువటే'. ఈ మాట ఈ జనరేషన్‌ కన్నా, గత జనరేషన్‌ ప్రేక్షకులకు బాగా పరిచయమున్న మాట.

అలనాటి మేటి పాట 'నన్ను దోచుకుందువటే వన్నెల దొరసాని.. కన్నులలో దాచుకుందు నిన్నే నా స్వామి..' అంటూ ఆ కాలంలో ఎన్టీఆర్‌, సావిత్రి పాడుకున్న పాట. ఈ పాటలోంచే మన సుధీర్‌బాబు ఈ టైటిల్‌ని పట్టాడు. అంతేకాదు ఇంతవరకూ విలక్షణ నటుడిగా తన స్టైల్‌ చూపించిన సుధీర్‌బాబు ఈ సినిమాతో మరో అడుగు ముందుకు వేశాడు. నిర్మాతగా మారాడు.

సొంత బ్యానర్‌ సుధీర్‌బాబు ప్రొడక్షన్స్‌ బ్యానర్‌లో తెరకెక్కుతోన్న తొలి సినిమా ఇది. నభా నటేష్‌ హీరోయిన్‌గా నటిస్తోంది. ఆర్‌.ఎస్‌. నాయుడు దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. కొత్త బ్యానర్‌, కొత్త దర్శకుడు, సరికొత్త కథా, కథనాలతో ఆధ్యంతం ఆకట్టుకునేలా ఈ సినిమా ఉండబోతోందట.

ఇకపోతే ఫస్ట్‌లుక్‌ విషయానికి వస్తే, టేబుల్‌పై హీరోయిన్‌ కూర్చొని వయ్యారంగా సెల్ఫీ తీసుకుంటుంటే, పక్కనే ఆమె వైపు కొంటెగా కొంచెం వెటకారంగా చూస్తున్న సుధీర్‌బాబు. ఈ లుక్‌కి మంచి రెస్పాన్స్‌ వస్తోంది. ఫస్ట్‌లుక్‌తోనే పడగొట్టేసిన సుధీర్‌బాబు సినిమాతో ఏ స్థాయిలో ఆకట్టుకుంటాడో చూడాలిక.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS