ఈవారం చాలా చిత్రాలు విడుదలైనప్పటికి ఎక్కువమంది ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించిన ఏకైక చిత్రం- నన్ను దోచుకుందువటే.
హీరో సుధీర్ బాబు తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకోవడమే కాకుండా మంచి చిత్రాలని ఒక హీరోగా ప్రేక్షకులకి అందిస్తున్నాడు. ఇక తాజాగా ఆయన నిర్మాతగా మారి తనే హీరోగా చేస్తూ ఒక కొత్త దర్శకుడిని ‘నన్ను దోచుకుందువటే’తో ఇండస్ట్రీకి పరిచయం చేశాడు.
ఇక ఈ సినిమా కథ విషయానికి వస్తే, రెండు భిన్నధృవాలైన వారి మధ్య ఏర్పడే ప్రేమకి సరైన మోతాదులో సెంటిమెంట్, కామెడీ వంటి వాటిని జతచేసి ప్రేక్షకులు మెచ్చే ఒక మంచి చిత్రంగా నన్ను దోచుకుందువటేని రూపొందించాడు దర్శకుడు RS నాయుడు.
తనకి దొరికిన అవకాశాన్ని పూర్తిగా సద్వినియోగం చేసుకున్నాడు ఈ కొత్త దర్శకుడు. ఈ సినిమా విడుదలకి ముందే ఆయనకి ఇద్దరు నిర్మాతల నుండి అడ్వాన్సులు ఎందుకు వచ్చాయి అన్నది ఈ సినిమా చూస్తే మనకి అర్ధమైపోతుంది.
ఈ చిత్రంలో మరో ప్రధాన ఆకర్షణగా నిలిచింది నభ నటేష్, ఈ చిత్రంలో ఆమె నటన చూశాక కచ్చితంగా ఆమె ఇంకొన్నాళ్ళు ఇక్కడ ఉంటుంది అన్న నమ్మకం కలుగుతుంది. చక్కటి హాస్యం, ముఖ్యంగా ‘సిరి’ కామెడీ & షార్ట్ ఫిలిం కామెడీ మాత్రం ప్రేక్షకులని కడుపుబ్బా నవ్విస్తాయి.
చివరగా ఈ చిత్రంతో సుధీర్ బాబు మంచి హీరోగానే కాకుండా ఒక మంచి నిర్మాతగా కూడా తన ముద్రని చాటుకున్నాడు. ఇది ఈ వారం www.iQlikmovies.com టాక్ అఫ్ ది వీక్.