ఈరోజు బిగ్ బాస్ హౌస్ నుండి వెళ్ళిపోయేది రోల్ రైడా నేనా?

మరిన్ని వార్తలు

ఈ ఆదివారంతో బిగ్ బాస్ హౌస్ లో సీజన్ 2కి సంబంధించిన ఆఖరి ఎలిమినేషన్ జరగనుంది. రేపటి నుండి ఆఖరి వారం మొదలై ఇంటిలోని టాప్ 5 సభ్యులు ఫైనల్స్ కి వెళ్ళడం జరుగుతుంది.

ఇక ఈ వారం ఎలిమినేట్ అయ్యే కంటేస్టంట్ రోల్ రైడా అనే సర్వత్రా వ్యక్తమవుతున్న అభిప్రాయం. దీనికి కారణం వీక్షకుల దృష్టిలో రోల్ రైడా తో సరి సమానంగా సామ్రాట్ కి కూడా ఫాలోయింగ్ ఉండడం మిగతా నలుగురు సభ్యులకి వీరితో పోల్చితే కాస్త ఎక్కువే మద్దతు ఉండడంతో ఈ ఇద్దరి పైనే ఈ వారం అందరి దృష్టి ఉంది.

కాకపోతే మొన్న జరిగిన టాస్క్ లో రోల్ రైడా పైన సామ్రాట్ గెలవడంతో ఆయన నేరుగా ఫైనల్స్ కి వెళ్ళిన తొలి సభ్యుడిగా ఈ సీజన్ లో నిలిచాడు. దీనితో రోల్ రైడా ఇప్పుడు ఎలిమినేషన్ డేంజర్ లో ఉన్నాడు అని చెప్పాలి.

ఈ సస్పెన్స్ కి ఈ రాత్రితో తెరపడనుంది. ఈరోజుతో టాప్ 5 ఎవరు అన్నదాని పైన ఒక పక్కా క్లారిటీ వచ్చేస్తుంది.

 


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS