రూటు మార్చిన నారా రోహిత్‌

మరిన్ని వార్తలు

ఇంతవరకూ విలక్షణ చిత్రాలనే ఎంచుకున్న హీరో నారా రోహిత్‌, తొలిసారిగా కమర్షియల్‌ వైపు అడుగులు వేశాడు 'బాలకృష్ణుడు' సినిమాతో. పవన్‌ మల్లెల దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కింది. ఈ నెల 24న ప్రేక్షకుల ముందుకు రానుంది. కాగా ఇకపై నారా రోహిత్‌ కమర్షియల్‌ బాటలోనూ నడవాలని అనుకుంటున్నాడట. 

హీరోకి ఉండాల్సిన లక్షణాలు ఇవి అని ఖచ్చితంగా పాఠించాల్సిన అవసరం లేదని ఇంతవరకూ తన ఫిట్‌నెస్‌పై కాన్‌సన్‌ట్రేషన్‌ చేయలేదు మనోడు. కానీ ఇక నుండి బాడీ ఫిట్‌నెస్‌పై ఫుల్‌గా ఫోకస్‌ పెట్టాలనుకుంటున్నాడట నారా రోహిత్‌. ఇప్పటికే 20 కిలోల బరువు తగ్గి, సిక్స్‌ ప్యాక్‌ కూడా ట్రై చేసేశాడు 'బాలకృష్ణుడు' సినిమాతో. అయితే ఒక్క మాట సినిమా అంతా సిక్స్‌ ప్యాక్‌తో కనిపించనని ముందుగానే చెప్పేస్తున్నాడు. రెజీనా హీరోయిన్‌గా నటించింది ఈ సినిమాలో. ఈ ఇద్దరి మధ్యా కెమిస్ట్రీ సూపర్బ్‌గా వర్కవుట్‌ అయ్యింది. అలాగే ఇక నుండీ

 

కమర్షియల్‌ సినిమాల్లో నటించేందుకు రెడీగా ఉన్నాననీ, ఇప్పటికే రెండు కమర్షియల్‌ సినిమాలు చేతిలో ఉన్నాయంటున్నాడు నారా రోహిత్‌. వాటిలో పరుచూరి మురళి దర్శకత్వంలో ఓ సినిమా, పవన్‌ సాధినేని దర్శకత్వంలో మరో సినిమా చేస్తున్నాడు నారా రోహిత్‌. పవన్‌తో చేయబోయే సినిమా హారర్‌ జోనర్‌లో ఉండబోతోందట. అయినా కానీ కమర్షియల్‌ అంశాలున్న సినిమా అట. స్టోరీ కొత్తగా ఉంటుందట. అలాగో మరో రెండు క్యూట్‌ రొమాంటిక్‌ స్టోరీలు చర్చల దశలో ఉన్నాయట. త్వరలోనే వాటి వివరాలు వెల్లడిస్తానంటున్నాడు నారా రోహిత్‌.

 

ఇవన్నీ కాక నిర్మాతగా ఓ సినిమాని రూపొందిస్తున్నాడ నారా రోహిత్‌. శ్రీవిష్ణు ఈ సినిమాలో హీరో, కాగా ఓ ఇంపార్టెంట్‌ రోల్‌లో రోహిత్‌ కనిపిస్తాడట. త్వరలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక నుండి తన సినిమాలు వరుస పెట్టి విడుదల చేయకుండా, ఆచి తూచి విడుదలయ్యేలా కేర్‌ తీసుకుంటానంటున్నాడు నారా రోహిత్‌.

 


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS