గత కొన్ని రోజులుగా టాలీవుడ్‌లో ప్రముఖ దర్శకులు, ప్రొడ్యూసర్లు, హీరోలపై అసభ్యకరమైన ఆరోపణలు చేస్తూ సోషల్ మీడియాలో రెచ్చిపోయి పోస్టులు పెడుతోన్న నటి శ్రీరెడ్డి ఇప్పుడు హీరోయిన్స్ మీద కూడా చిర్రుబుర్రులాడడం మొదలెట్టింది. ఇప్పుడొస్తున్న హీరోయిన్లు పెద్ద ప్రొడ్యూసర్స్‌కీ, హీరోలకు, డైరెక్టర్లకూ ఎలా గాలమేస్తున్నారో అంతా తనకు తెలుసనీ, అలాంటి వారు టాలీవుడ్‌పై ఎలా తమ అజమాయిషీ చూపిస్తున్నారో తనకు బాగా తెలుసనీ ఇప్పుడొస్తున్న పలువురు హీరోయిన్స్ మీద కూడా ఆరోపణలు చేసేసింది.
సాటి అమ్మాయిగా అమ్మాయిలపై కూడా ఇలాంటి అసభ్యకరమైన ఆరోపణలు చేస్తోందంటూ, తలలు పట్టుకుంటున్నారు శ్రీరెడ్డి బిహేవియర్‌కి. ఇప్పుడున్న హీరోయిన్స్ అంతా మైదాపిండి ముద్దలు. వారికి ఏమీ రాదు. కానీ ఎర వేసి ముగ్గులోకి దించడం బాగా తెలుసంటోంది. అంతేకాదు, ఎక్కడ స్విచ్ నొక్కితే, ఎక్కడ బల్బు వెలుగుతుందో వారికి తెలిసినంతగా బాబోయ్ మా తెలుగమ్మాయిలకు తెలీదు అంటూ హీరోయిన్స్‌పై పడింది. అంతేకాదు ఓ హీరోయిన్‌ని గెడ కర్ర అంటూ సంబోధిస్తూ పిచ్చ పిచ్చగా కామెంట్స్ చేసి పాడేసింది.
అసలింతకీ శ్రీరెడ్డికి ఏం కావాలో ఎవరికీ తెలియడం లేదు. వారం రోజులు టైమిచ్చింది. ఈ వారంలోగా తనచే ఆరోపణలు ఎదుర్కొంటున్న వారు బయటికి వచ్చి, ఆమెకి న్యాయం చేయాలట. అలా చేయకపోతే, ఫిల్మ్ నగర్ నడి బజార్లో బట్టలిప్పేస్తానని చెబుతోంది. ఆ రకంగా ఇకపై తన నిరసన తెలియచేస్తాననీ శ్రీరెడ్డి చెబుతోంది. చూడాలి మరి.