లాక్ డౌన్ తరవాత ఓటీటీ వేదికలకు మరింత డిమాండ్ పెరిగింది. థియేటర్లో విడుదల కాని కొన్ని సినిమాల్ని మంచి రేటుకి కొనేసి తమ ఓటీటీ వేదికలపై ప్రదర్శించాలని సంస్థలు పోటీ పడుతున్నాయి. ప్రస్తుతం అందుకు సంబంధించిన చర్చలు జరుగుతున్నాయి. అయితే సందీప్ కిషన్ సినిమా మాత్రం నేరుగా ఓటీటీలోనే విడుదల అవ్వడానికి రెడీ అయ్యింది. అయితే ఇది తెలుగు సినిమా కాదు, ఓ తమిళ చిత్రం.
అరవింద్ స్వామి, శ్రియ శరణ్, సందీప్ కిషన్ కలిసి ఓ తమిళ చిత్రంలో నటించారు. అదే.. నరగసూరన్. 2017 లో ఈ సినిమా సెట్స్‌పైకి వెళ్లింది. అప్పటి నుంచీ విడుదల కాలేదు. ఆర్థిక కారణాల వల్ల, ఇతర సంకేతిక సమస్యల వల్ల ఈ సినిమా విడుదల వాయిదా పడుతూనే ఉంది. మార్చి 27న విడుదల చేద్దామనుకన్నారు. కానీ లాక్ డౌన్ వల్ల మరోసారి ఆటంకం ఎదురైంది. ఇక ఈ సినిమాని థియేటర్లో విడుదల చేసే పరిస్థితి లేదనుకున్నారేమో. ఇప్పుడు ఈ చిత్రాన్ని నేరుగా ఆమేజాన్‌లో విడుదల చేసేస్తున్నారు. ఈనెల 17న ఇది అమేజాన్‌లో స్ట్రీమింగ్ అవ్వబోతోంది. సందీప్ కిషన్ ఇది వరకు కొన్ని తమిళ సినిమాలు చేశాడు. కాబట్టి కాస్తో కూస్తో క్రేజ్ ఉంది. పైగా అరవింద స్వామి, శ్రియ.. ఇలాంటి పెద్ద పెద్ద స్టార్లు ఉన్నారు. సో... రేటింగ్‌కి ఢోకా లేనట్టే. దీన్ని తెలుగులోనూ డబ్ చేసి విడుదల చేస్తారేమో చూడాలి.