Naresh: విడాకులు తీసుకోకుండానే నాలుగో పెళ్లంటే ఎలా?

మరిన్ని వార్తలు

ఈమ‌ధ్య సీనియ‌ర్ న‌టుడు న‌రేష్ పేరు ఎక్కువ‌గా వార్త‌ల్లో వినిపిస్తోంది. న‌టి ప‌విత్రా లోకేష్‌ని ఆయ‌న పెళ్లి చేసుకోబోతున్నార‌న్న‌ది వార్త‌ల సారాంశం. కొంత‌మంది అయితే... న‌రేష్ - ప‌విత్ర‌లకు ర‌హ‌స్యంగా పెళ్లి జ‌రిగిపోయిందంటూ వార్త‌లు పుట్టిస్తున్నారు.

 

వీటిపై న‌రేష్ గానీ, ప‌విత్ర గానీ స్పందించ‌డం లేదు. త‌న‌పై ఫేక్ వార్త‌లు పుట్టిస్తున్నార‌ని ప‌విత్ర పోలీసుల‌కు ఫిర్యాదు చేయ‌డం విశేషం. అయితే ఇప్పుడు తెర‌పైకి న‌రేష్ భార్య ర‌మ్య వ‌చ్చారు. న‌రేష్ ఇప్ప‌టికీ తన భ‌ర్తే అని, కోర్టు ఇంకా విడాకులు మంజూరు చేయ‌లేద‌ని, భ‌ర‌ణం విషయంలో స్ప‌ష్ట‌త ఇంకా రాలేద‌ని, న‌రేష్ విడాకుల నోటీసు పంపించినా, త‌ను సంత‌కాలు చేయ‌లేద‌ని ఆమె స్ప‌ష్టం చేశారు. న‌రేష్ - ర‌మ్య‌ల‌కు ఇంకా విడాకులు రాలేద‌న్న‌ది స్ప‌ష్టం అయ్యింది. విడాకులు రాకుండా మ‌రో పెళ్లి చేసుకోవ‌డం చ‌ట్ట రీత్యా నేరం. కాబ‌ట్టి న‌రేష్ ఆ త‌ప్పు చేసి ఉండ‌రు. అందుకే ముందు విడాకుల గొడ‌వ తేల్చుకొని, ఆ త‌ర‌వాత‌.. పెళ్లి చేసుకుందామ‌నుకుని ఉండొచ్చు. అందుకే న‌రేష్ ఇప్ప‌టికీ నోరు మెద‌ప‌డం లేదు.

 

న‌రేష్‌తో త‌న‌కు సంబంధాలు ఉన్నాయ‌ని ప‌విత్ర లోకేష్ పేర్కొన‌ట్టు... ఓ వీడియో వైర‌ల్ అవుతోంది. దాన్ని కావాల‌ని సృష్టించారా, లేదంటే నిజంగానే ప‌విత్ర లోకేష్ ఆ మాట అన్నారా...? అనేది మాత్రం తెలియాల్సివుంది.

 

ఈ వ్య‌వ‌హ‌రం ఇంకా ముద‌రకుండా కోర్టు బ‌య‌ట కాంప్ర‌మైజ్ చేసుకోవాల‌ని న‌రేష్ ప్ర‌య‌త్నిస్తున్న‌ట్టు ఇన్ సైడ్ వ‌ర్గాలు చెబుతున్నాయి. అయితే... ర‌మ్య అందుకు నిరాక‌రిస్తున్నార‌ని తెలుస్తోంది. ర‌మ్య‌కి న‌రేష్ తో క‌లిసే ఉండాల‌ని ఉంద‌ని, అందుకే ఆమె విడాకుల‌కు నో చెబుతున్నార‌ని టాలీవుడ్ లో గుస‌గుస‌లాడుకుంటున్నారు.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS