`మా` ఎన్నికల ముందే.. వార్మప్ మ్యాచ్‌లు ఆడేస్తున్నారు నరేష్ - ప్రకాష్ రాజ్. ఈసారి ఎన్నికలకు తాను సిద్ధమంటూ.. ప్రకాష్‌రాజ్ ప్రకటించడంతో `మా` ఎన్నికల వేడి రాజుకుంది. ఆ మంట రోజు రోజుకీ పెరుగుతోంది. తన ప్యానల్ తో ప్రకాష్ రాజ్ ఓ ప్రెస్ మీట్ పెట్టడం - అందులో కొన్ని ప్రశ్నలు సంధించడం, ఆ వెంటనే నరేష్ కూడా.. ఓ ప్రెస్ మీట్ పెట్టి సమాధానాలు ఇవ్వడం తెలిసిన విషయాలే. ప్రకాష్ రాజ్ అంతటితో ఆగలేదు. `ఎలక్షన్స్ ఎప్పుడు` అంటూ ఓ ట్వీట్ చేశారు. దాంతో నరేష్ మరోసారి .. రంగంలోకి దిగాల్సివచ్చింది.
``మా ఎన్నికల విషయంలో ఇప్పటికే చాలాసార్లు సమాధానం చెప్పాను. అయినా కొంతమంది పదే పదే ఎన్నికలు ఎప్పుడు అంటూ ప్రశ్నిస్తున్నారు. వాళ్ల తీరు చూస్తుంటే... నీళ్లు నింపకుండానే స్విమ్మింగ్ పూల్ లోకి దూకనా.. అని అడిగినట్టుంది`` అని సెటైర్ వేశారు. మా ఎన్నికలు సెప్టెంబరులోనే జరుగుతాయని స్పష్టం చేశారు. దీంతో ప్రకాష్ రాజ్‌కి కావల్సిన సమాధానం వచ్చేసినట్టైంది. ఇకనైనా ఆయన శాంతిస్తారో లేదో?!