ఈవారం విడుదలైన రెండు చిత్రాలు- @ నర్తనశాల & పేపర్ బాయ్.
ముందుగా నాగ శౌర్య హీరోగా వచ్చిన @ నర్తనశాల గురించి మాట్లాడుకుందాం. ఈ చిత్రానికి సంబంధించిన టైటిల్ ప్రకటన రాగానే అందరి దృష్టి దీనిపైన పడింది. అయితే ఎన్టీఆర్ నర్తనశాలకి ఈ చిత్రకథకి అసలు సంబంధం లేదు అని నాగ శౌర్య ముందుగానే క్లారిటీ ఇచ్చేశాడు.
ఇక ఈ చిత్ర కథ విషయానికి వస్తే, ‘గే’ కాన్సెప్ట్ చుట్టూ అల్లుకున్న ఒక ఎంటర్టైన్మెంట్ కథ ఇది. అయితే ఇంతటి ఆసక్తికరమైన కాన్సెప్ట్ ని డీల్ చేయడంలో శ్రీనివాస చక్రవర్తి విఫలమయ్యాడు అనే చెప్పాలి. ముఖ్యంగా ఇటువంటి కాన్సెప్ట్స్ లో హ్యుమర్ చాలా ఎక్కువగా ఉంటే ప్రేక్షకులకి ఆ చిత్రం ఇంకా బాగా నచ్చే అవకాశం ఉంది.
ఛలో వంటి బ్లాక్ బస్టర్ తరువాత వచ్చిన ఈ చిత్రం మాత్రం అంతటి స్థాయిని అందుకోలేకపోయింది.
ఇక ఈ వారం విడుదలైన రెండవ చిత్రం- పేపర్ బాయ్. ప్రముఖ దర్శకుడు సంపత్ నంది రచయిత-నిర్మాతగా మారి రూపొందించిన చిత్రం పేపర్ బాయ్.
సంతోష్ శోభన్ హీరోగా రియా సుమన్ & తాన్యా హాప్ జంటగా నటించిన పేపర్ బాయ్ చిత్రం. ఇది ఒక రెగ్యులర్ ఫార్ములా కథ అని దర్శక-నిర్మాతలు ముందే చెప్పేశారు. దీనితో ఈ కథ గురించిన అంచనాలు పెద్దగా లేకపోయినప్పటికి ఈ చిత్ర పంపిణీ హక్కులని గీత ఆర్ట్స్ తీసుకోవడంతో ఈ చిత్రానికి క్రేజ్ వచ్చింది.
అయితే ఈ సినిమాని తెరకెక్కించే విషయంలో మాత్రం దర్శకుడు విజయ్ శంకర్ కాస్త తడబడ్డాడు. ఇటువంటి రొటీన్ కథని ఇంకాస్త ఇంటరెస్టింగ్ తీయాల్సి ఉంటుంది, ఈ సినిమా విషయంలో అది ఒక మైనస్ పాయింట్ లా చెప్పొచ్చు. హీరోగా నిలదొక్కుకునే ప్రయత్నం చేస్తున్న సంతోష్ కి ఈ సినిమా కాస్త నిరాశనే మిగిల్చింది అని చెప్పాలి.
ఇది ఈ వారం www.iQlikmovies.com టాక్ అఫ్ ది వీక్.