నందమూరి బాలకృష్ణ స్వీయ దర్శకత్వంలో రూపొందిన చిత్రం `నర్తనశాల`. ఎప్పటిదో సినిమా ఇది. కొంత మేర షూటింగ్ జరుపుకుని అనివార్య కారణాల వల్ల ఆగిపోయింది. షూటింగ్ జరిపిన భాగాన్ని ఎడిట్ చేసి, రీ రికార్డింగ్ జోడించి ఇప్పుడు చూపించబోతున్నారు. ఈనెల 24న శ్రేయాస్ ఏటీటీ ద్వారా విడుదల అవుతోంది. ఈ 17 నిమిషాల సన్నివేశాల్ని చూడాలంటే ప్రేక్షకులు టికెట్ కొనాల్సిందే.
ఈ టికెట్ ధర 50 రూపాయలుగా నిర్ణయించినట్టు తెలుస్తోంది. బాలయ్య సినిమా. పైగా తన దర్శకత్వంలో రూపొందించిన సినిమా. సౌందర్య లాంటి ఒకప్పటి మేటి నటి నటించిన చివరి చిత్రం. కాబట్టి సాధారణంగానే ఈ సినిమా చూడాలన్న ఆసక్తి ఉంటుంది. 50 రూపాయలంటే మంచి రేటే. ఈ షో ద్వారా వచ్చే ఆదాయంలో కొంత భాగం సామాజిక సేవా కార్యక్రమాలకు ఉపయోగిస్తారు. అయితే తొలి టికెట్ ని 10 లక్షలకు కొనడానికి కొంతమంది బాలయ్య డైహార్డ్ ఫ్యాన్స్ ప్రయత్నిస్తున్నార్ట. 17 నిమిషాల సినిమా చేడ్డానికి లక్షలు ఇవ్వడానికి బాలయ్య అభిమానులు రెడీ అయ్యారంటే.. గొప్ప విషయమే మరి.