క్రిష్ సినిమాలో రానా?

By Gowthami - October 20, 2020 - 16:00 PM IST

మరిన్ని వార్తలు

రానా - క్రిష్ కాంబినేష‌న్‌లో `కృష్ణం వందే జ‌గ‌ద్గురుమ్‌` వ‌చ్చిన సంగ‌తి తెలిసిందే. ఈ సినిమాకి విమ‌ర్శ‌కుల ప్ర‌శంస‌లు ల‌భించాయి. అప్ప‌టి నుంచీ క్రిష్ - రానా ల మ‌ధ్య బాండింగ్ మ‌రింతగా పెరిగింది. ఆ అనుబంధంతోనే క్రిష్ సినిమాలో అతిథి పాత్ర చేయ‌డానికి రానా ఒప్పుకున్న‌ట్టు స‌మాచారం. క్రిష్ ద‌ర్శ‌క‌త్వంలో వైష్ణ‌వ్ తేజ్ క‌థానాయ‌కుడిగా ఓ చిత్రం రూపుదిద్దుకుంటున్న సంగ‌తి తెలిసిందే. ర‌కుల్ ప్రీత్ సింగ్ క‌థానాయిక‌.

 

ఈ సినిమాలో రానా అతిథి పాత్ర‌లో క‌నిపించ‌బోతున్న‌ట్టు స‌మాచారం. ప్ర‌స్తుతం వికారాబాద్ అడవుల్లో షూటింగ్ జ‌రుగుతోంది. త్వ‌ర‌లోనే రానా... సెట్లో అడుగుపెట్ట‌బోతున్నాడ‌ని, ఈ సినిమాలో రానా పాత్ర కాసేపే క‌నిపించినా, చాలా స్పెష‌ల్ గా ఉంటుంద‌ని తెలుస్తోంది. `కొండ‌పొలం` అనే ఓ న‌వ‌ల ఆధారంగా ఈ చిత్రం తెర‌కెక్కుతున్న సంగ‌తి తెలిసిందే. డిసెంబ‌రు క‌ల్లా షూటింగ్ పూర్తి చేయాల‌ని క్రిష్ భావిస్తున్నాడు. 2021 ప్ర‌ధ‌మార్థంలో ఈ సినిమా విడుదల ‌కానుంది.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS