తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నుండి ఎంపీ సంతోష్ మొదలు పెట్టిన హారితహారం కార్యక్రమంలో భాగంగా "నరుడి బ్రతుకు నటన" సినిమా హీరోయిన్ మాధురి తన పుట్టినరోజు సందర్భంగా బుధవారం నాడు హైదరాబాద్ లో తన ఇంట్లో మొక్కను నాటింది.
ఈ సందర్భంగా మాధురి మాట్లాడుతూ ముందుగా తెలంగాణ ప్రభుత్వానికి ధన్యవాదాలు.. గ్రీన్ ఛాలెంజ్ లో నేను భాగం ఐనందుకు చాలా సంతోషంగా ఉంది, ఈ ఛాలెంజ్ ని భీమవరం టాకిస్ నిర్మాత తుమ్మలపల్లి రామ సత్యనారాయణ గారికి, అలానే సినిమా హీరో తల్లాడ సాయికృష్ణ కి ఇస్తున్నాను. అలానే ప్రతి ఒక్కరు మొక్కలని నాటడం కాకుండా జాగ్రత్తగా కాపాడుకునెలా చూసుకోవాలి అని అన్నారు.