బుల్లి తెర నటి నవ్య స్వామికి కరోనా సోకిందన్న వార్త సోషల్ మీడియాలో గట్టిగా హల్ చల్ చేస్తోంది. దీనిపై నవ్య స్పందించారు. తనకు కరోనా సోకిందన్న విషయం నిజమేనని, ప్రస్తుతానికి తాను క్వారెంటైన్‌లో ఉంటున్నానని, త్వరలోనే సంపూర్ణ ఆరోగ్యంతో తిరిగి వస్తానని ధీమా వ్యక్తం చేశారు నవ్య. నా పేరు మీనాక్షి, ఈమె కథ సీరియళ్లతో పాపులర్ అయ్యింది నవ్య. ఓ టీవీ సీరియల్ లో భాగంగా షూటింగ్ జరుగుతున్నప్పుడు అనారోగ్యం పాలైంది. అనుమానం వచ్చి కోవిడ్ టెస్టులు చేయిస్తే - పాజిటీవ్ అని తేలింది.
''నాకు కరోనా సోకింది.. అయినా భయపడడం లేదు. ఇది అవమానపడాల్సిన విషయం కాదు. నేను ఇంట్లోనే ఉంటూ స్వీయ రక్షణ చర్యలు తీసుకుంటున్నా. యోగా చేస్తున్నా. మంచి ఆహారం తీసుకుంటున్నా. త్వరలోనే కోలుకుంటానన్న నమ్మకం ఉంది..'' అంటూ సోషల్ మీడియాలో ఓ వీడియో పోస్ట్ చేసింది నవ్య. ''నెగిటివిటీకి దూరంగా ఉండండి. వ్యాధి బారీన పడడం కంటే, ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవడం ఉత్తమం'' అంటూ తన అభిమానులకు సందేశం ఇచ్చింది.