బ్లేక్‌ హాట్‌ బాలయ్య బ్యూటీ.!

By iQlikMovies - July 19, 2018 - 10:40 AM IST

మరిన్ని వార్తలు

బాలయ్య హీరోగా నటించిన 'జై సింహా' చిత్రంలో హీరోయిన్‌గా నటించింది ముద్దుగుమ్మ నటాషా దోషి. ఈ సినిమా విజయం సంగతి బాలయ్య ఫ్యాన్స్‌కే తెలుసును కానీ, ముద్దుగుమ్మ నటాషా దోషీ విషయానికి వస్తే, ఈ చిత్రంలో బాలయ్యతో ఆన్‌ స్క్రీన్‌ రొమాన్స్‌ బాగానే చేసింది. తొలి సినిమాకే బాలయ్య వంటి స్టార్‌ హీరో సరసన ఛాన్స్‌ రావడమంటే మాటలు కాదు. అంతేకాదు, ఈ సినిమాలో నటాషాతో పాటు, నయనతార వంటి సీనియర్‌ హీరోయిన్లున్నప్పటికీ, ఈ ముద్దుగుమ్మ పాత్రకు ప్రాధాన్యత బాగానే దక్కింది. బాలయ్యతో కలిసి ఓ సాంగ్‌కి నటాషా వేసిన స్టెప్పులు యూత్‌ని బాగా ఎట్రాక్ట్‌ చేశాయి. కానీ ఆ తర్వాత అమ్మడు ఎక్కడా కనిపించలేదు. తాజాగా సోషల్‌ మీడియాలో తన హాట్‌ హాట్‌ అందాలతో ప్రేక్షకులకు కనువిందు చేస్తోందిదిగో ఇలా. బ్లాక్‌ హాట్‌ కాస్ట్యూమ్‌లో నటాషా అందాలు అదరహో అనిపిస్తున్నాయి కదా.!


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS