'అతిలోకసుందరి' అవునా? కాదా.?

మరిన్ని వార్తలు

ఎన్టీఆర్‌ బయోపిక్‌లో స్మైలీ బ్యూటీ రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ నటిస్తోందంటూ గత కొంత కాలంగా వార్తలు వినిపిస్తున్నాయి. ఈ బయోపిక్‌లో రకుల్‌ని ఏ పాత్ర కోసం ఎంచుకుని ఉంటారా ? అంటూ ఆమె అభిమానులు రకరకాలుగా అనుమానం వ్యక్తం చేశారు. అయితే రకుల్‌కి అపూర్వమైన అవకాశం దక్కిందంటూ విశ్వసనీయ వర్గాల సమాచారమ్‌. 

అదేంటంటారా? 'ఎన్టీఆర్‌' బయోపిక్‌లో రకుల్‌ ప్రీత్‌సింగ్‌ అతిలోక సుందరి శ్రీదేవి పాత్ర పోషిస్తుందంటూ తాజాగా సమాచారమ్‌ అందుతోంది. ఒకవేళ ఈ టాక్‌ నిజమే అయితే అవును నిజంగానే రకుల్‌కిది అరుదైన అవకాశమే. అసలే రకుల్‌కి ప్రస్తుతం తెలుగులో అంత సీను లేదాయె. అలాంటిది 'ఎన్టీఆర్‌' బయోపిక్‌. అందులోనూ అతిలోకసుందరి శ్రీదేవి పాత్ర అంటే రకుల్‌ నక్కతోక తొక్కినట్లే. 

అయితే ఈ విషయంలో రకుల్‌ ఇంతవరకూ స్పందించలేదు. మరోవైపు బోయపాటి - చరణ్‌ కాంబినేషన్‌లో తెరకెక్కుతోన్న సినిమాలోనూ రకుల్‌ స్పెషల్‌ సాంగ్‌ చేస్తోందట. ఈ విషయంలోనూ అఫీషియల్‌ క్లారిటీ లేదు. మరోవైపు తాజాగా మహేష్‌ - సుకుమార్‌ కాంబో మూవీలోనూ రకుల్‌ నటిస్తోందంటూ గాసిప్స్‌ వస్తున్నాయి. 

ఏమో మరి నిన్న మొన్నటి దాకా స్టార్‌ హీరోయిన్‌గా వెలుగొందిన రకుల్‌ప్రీత్‌సింగ్‌ తెలుగులో రీ ఎంట్రీ కోసం ఎన్ని పాట్లు పడాల్సి వస్తుందో. బాలీవుడ్‌లో 'అయ్యారీ' సినిమాతో తెరంగేట్రం చేసిన రకుల్‌ అక్కడ ప్రస్తుతం మరో సినిమాలో నటిస్తోంది. అజయ్‌ దేవగణ్‌ హీరోగా నటిస్తున్నాడీ సినిమాలో. తమిళంలో మాత్రం ఫుల్‌ బిజీగా గడుపుతోంది రకుల్‌ప్రీత్‌సింగ్‌.
 


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS