చిరంజీవి కలల చిత్రం `సైరా`. దాదాపు రెండేళ్ల కృషి, పన్నేండేళ్ల కళ, 250 కోట్ల కష్టం `సైరా`. ఈ కష్టం ఫలించి చిరంజీవికి మంచి విజయాన్నే కట్టబెట్టేలా చేసింది. హిందీతో సహా మిగిలిన భాషల్లో `సైరా` ప్రభావం చూపించలేకపోయినా తెలుగులో మాత్రం కళ్లు చెదిరే వసూళ్లు సాధించింది. తొలి పది రోజుల్లో దాదాపుగా 95 కోట్లు (షేర్) సాధించి వంద కోట్ల మైలు రాయికి అత్యంత చేరువలో ఉంది. ఈ వారం విడుదలైన సినిమాలు తుస్సుమనడంతో... ఈ వారంలోనే `సైరా` వంద కోట్లు సాధించే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.
ఈవారంలోనే నైజాంతో సహా కొన్ని ప్రాంతాలలో బ్రేక్ ఈవెన్ అవ్వొచ్చు. పండగ జీజన్ ముగిసినా కొన్ని ప్రాంతాలలో వసూళ్లు నిలకడగా ఉన్నాయి. దాదాపు 50 శాతం ఆక్యుపెన్సీతో థియేటర్లు కళకళలాడుతున్నాయి. ఈ జోరు ఎన్ని రోజులు కొనసాగుతుందో చూడాలి. నైజాంలో ఇప్పటి వరకూ సైరా 28.6 కోట్లు సాధించింది. సీడెడ్‌లో 17 కోట్లు వచ్చాయి. ఉత్తరాంధ్రలో 14.4 కోట్లు వసూలు చేసింది. కృష్ణాలో 7 కోట్లు, ఈస్ట్ - వెస్ట్ కలసి 14 కోట్లు వచ్చాయి. కర్నాటక, ఓవర్సీస్ లెక్కలు ఇంకా అందాల్సివుంది.