విలన్ పాత్ర‌ల‌కు షిఫ్ట్ అయిపోయిన‌ట్టేనా?

మరిన్ని వార్తలు

చిత్ర‌సీమ‌కు ఎప్ప‌టిక‌ప్పుడు కొత్త‌నీరు వ‌చ్చి చేరుతుంది. పాత నీరు ప్ర‌వాహంలో కొట్టుకెళ్లిపోవ‌డం ప‌రిపాటి. కొత్త హీరోల తాకిడికి పాత హీరోలు సైడ్ అయిపోవాలి. లేదంటే రూటు మార్చుకోవాలి. న‌వీన్ చంద్ర అదే చేస్తున్నాడు. `అందాల రాక్ష‌సి`తో ఆక‌ట్టుకున్నాడు న‌వీన్ చంద్ర‌. ఆ సినిమాతో మంచి గుర్తింపు వ‌చ్చింది. అలాంటి ఒక‌ట్రెండు సినిమాలు ప‌డితే, న‌వీన్ ప‌రిస్థితి బాగుండేది. కానీ సోలో హీరోగా చేసిన సినిమాల‌న్నీ ఫ్లాప్ అయ్యాయి. హీరోగా ఛాన్సులు దూర‌మ‌య్యాయి. క్ర‌మంగా.. క్యారెక్ట‌ర్‌, విల‌నీల‌పై దృష్టి పెట్టాడు. 'నేను లోక‌ల్‌'లో నెగిటీవ్ ఛాయ‌లున్న పాత్ర పోషించాడు న‌వీన్‌. ఆ త‌ర‌వాత 'అర‌వింద స‌మేత‌'లోనూ అలాంటి పాత్ర‌లోనే క‌నిపించాడు.

 

ఓ త‌మిళ సినిమాలో పూర్తి స్థాయి విల‌న్‌గా న‌టించాడు. ఇప్పుడు బోయ‌పాటి శ్రీ‌ను సినిమాలోనూ న‌వీన్‌కు అలాంటి పాత్రే ద‌క్కింద‌ని టాక్‌. బాల‌కృష్ణ - బోయ‌పాటి కాంబోలో ఓ సినిమా తెర‌కెక్కుతోంది. ఈ సినిమాలో శ్రీ‌కాంత్‌కి ఓ కీల‌క పాత్ర దక్కింది. ఇప్పుడు న‌వీన్ చంద్ర కూడా ఈ టీమ్ లో చేరాడ‌ని తెలుస్తోంది. న‌వీన్‌ది నెగిటీవ్ షేడ్స్ ఉన్న పాత్ర అని స‌మాచారం. త‌న సినిమాల్లో.. ఒక‌రిద్ద‌రు మాజీ హీరోల‌కు మంచి మంచి పాత్ర‌లు క‌ట్ట‌బెట్ట‌డం బోయ‌పాటికి అల‌వాటే. అలా ఈసారి శ్రీ‌కాంత్‌, న‌వీన్‌ల‌కు చోటిచ్చాడు. ఈ సినిమాతో గ‌నుక క్లిక్ అయితే న‌వీన్‌కి కొత్త దారులు తెర‌చుకున్న‌ట్టే.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS