ఏజెంట్ సాయిశ్రీనివాస ఆత్రేయ, జాతిరత్నాలు సినిమాతో అదరగదొట్టేశాడు... నవీన్ పొలిశెట్టి. ఇప్పుడు అతను ఓ బుల్లిసైజ్ సూపర్ స్టార్. తన కాల్షీట్లు గరమ్ గరమ్ హాట్ కేకులు. ప్రస్తుతం యూవీ క్రియేషన్స్‌లో ఓ సినిమా చేస్తున్నాడు. అనుష్క కథానాయికగా నటిస్తోంది. ఈసినిమాతో నవీన్ పొలిశెట్టి స్టాండప్ కామెడియన్ గా నటిస్తున్నాడట. సాఫ్ట్ వేర్ ఇంజనీర్ గా పనిచేస్తూ... మధ్యమధ్యలో స్టాండప్ కామెడీ చేస్తూ నవ్విస్తుంటాడట. ఇలా రెండు అవతారాల్లో కనిపించడానికి ఓ కారణం ఉందని తెలుస్తోంది. `మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్`లో పూజా ఇలానే స్టాండప్ కామెడీ చేసింది. మొన్నామధ్య వచ్చిన `స్టాండప్ రాహుల్`లోనూ.. రాజ్ తరుణ్ అదే చేశాడు. అయితే.. స్టాండప్ కామెడీపై తగినంత ఫోకస్ పెట్టలేకపోయారు. ఈ సినిమాలో అలా కాదట. పైగా.. నవీన్ పొలిశెట్టి కామెడీ టైమింగ్ అదిరిపోతుంది. సో.. ఈ పాత్రని తను వేరే స్థాయిలోకి తీసుకెళ్లడం ఖాయం.
ఈ సినిమాతో అనుష్క ఇంటర్నేషనల్ చెఫ్‌గా కనిపించబోతోందని తెలిసింది. మరి చెఫ్‌కీ, స్టాండప్ కమెడియన్‌కీ లింకు ఎలా కుదిరిందన్నది.. సినిమాలోనే చూడాలి. పి. మహేష్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్ లో జరుగుతోంది,