సీనియర్ నటి అయినా కానీ ముద్దుగుమ్మ నయనతార యంగ్ హీరోస్‌కీ జోడీగా మారింది. ఆమె ఏ సినిమా చేసినా హిట్ పక్కా అన్నట్లుగా ఉంది. కోలీవుడ్‌లో నయన్‌కి ఎదురే లేదు. ఓ పక్క రొమాంటిక్ మూవీస్‌లో నటిస్తూనే, హీరోయిన్ సెంట్రిక్ మూవీస్‌కీ నయనే బెస్ట్ ఆప్షన్ అయ్యింది. తెలుగులోనూ అమ్మడికి సూపర్ పాపులారిటీ ఉంది. అయితే ప్రస్తుతం తెలుగులో సినిమాలు చేసేందుకు నయన్ ఇష్టపడడం లేదు. తాజాగా బాలకృష్ణ సరసన నయనతార నటించనుందనే న్యూస్ బయటికి వచ్చింది. ప్రస్తుతం బాలయ్య - పూరీతో 'సైసా వసూల్' సినిమాలో నటిస్తోంది. ఇది ఆయనకి 101వ చిత్రం. కాగా 102వ సినిమాని కూడా బాలయ్య లైన్‌లో పెట్టేశారు. ఈ 102వ సినిమా కోసం బాలకృష్ణ, నయనతార పేరు సూచించారట. ఈ చిత్రానికి కెఎస్ రవికుమార్ దర్శకుడు. 'సింహా', 'శ్రీరామరాజ్యం' చిత్రాల తర్వాత బాలకృష్ణ - నయనతార కాంబినేషన్‌లో వస్తున్న సినిమా కావడంతో ఈ సినిమాపై భారీ అంచనాలేర్పడుతున్నాయి. నయనతార ఈ మధ్యకాలంలో తెలుగు సినిమాల్లో నటించడానికి ఇష్టపడకపోయినప్పటికీ, బాలకృష్ణ కోసమే ఈ సినిమాలో నటించడానికి ఒప్పుకున్నట్లు తెలుస్తోంది. ఈ ఇద్దరి కాంబినేషన్‌లో వచ్చిన సినిమాలన్నీ సూపర్ డూపర్ హిట్సే అయ్యాయి. 100వ చిత్రం నుండీ బాలయ్య జోరు కొనసాగుతోంది. అలాగే హిట్ కాంబినేషన్‌తో తెరకెక్కుతోన్న ఈ సినిమాపై కూడా అదే అంచనాలున్నాయి. మొత్తానికి బాలకృష్ణ సూచనతో ముద్దుగుమ్మ నయనతార తిరిగి టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇస్తోందని అనుకోవచ్చు.