సినిమాల్లో తప్పితే ప్రమోషన్స్ లో కనిపించని స్టార్ నయనతార. అప్పుడెప్పుడో 'అనామిక' సినిమా సమయంలో ఓ వీడియో ఎంటర్వ్యూ ఇచ్చింది. మళ్ళీ ఇన్నాళ్ళ కు 'కనెక్ట్' సినిమా కోసం ఒక ప్రమోషనల్ వీడియో చేసింది. యాంకర్ సుమ తో చిట్ చాట్ లో మాట్లాడింది. తను పని చేసిన హీరోలందరి గురించి సరదా ముచ్చట్లు చెప్పింది. ఎన్టీఆర్ చాలా అల్లరి చేస్తారట. అలాగే తనపై జోకులు కూడా వేసేవాడు. అదుర్స్ సెట్ లో ఒకసారి ''‘ఎందుకు అంతలా మేకప్ వేసుకుంటున్నావు. స్క్రీన్‌పై నేను ఉన్నప్పుడు అందరూ నన్నే చూస్తారు కదా. ఇంకా నువ్వు రెడీ అవ్వాల్సిన అవసరం ఏముంది’ అని సరదాగా నవ్వేశాడట. తారక్ మంచి డ్యాన్సర్. రిహార్సల్స్ చేయకుండానే డ్యాన్స్ చేస్తాడని కితాబిచ్చింది.
''ప్రభాస్ స్వీట్ హార్ట్. సెట్‌లో బాగా అల్లరి చేసేవాడు. ఎంతో సరదాగా మాట్లాడేవాడు. ఇప్పుడు అతడు పెద్దస్టార్ అవ్వడం ఆనందంగా ఉంది. అలాగే ''రవితేజ నేనూ బెస్ట్ ఫ్రెండ్స్. మేమిద్దరం ఇప్పటికీ స్నేహితులమే కాకపోతే ఎవరి పనుల్లో వాళ్లం బిజీగా ఉండటం. ఈ మధ్య కాలంలో మేమిద్దరం కలవకపోవడం వల్ల కాస్త మాటలు తగ్గాయి'' అని చెప్పుకొచ్చింది నయన్.