'సైరా'లో సిద్దమ్మ కథేంటీ.!

మరిన్ని వార్తలు

ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కుతోన్న చిరంజీవి 151వ చిత్రం 'సైరా నరసింహారెడ్డి'లో సౌత్‌ క్వీన్‌ నయనతార కీలక పాత్ర పోషిస్తున్న సంగతి తెలిసిందే. ఆమె పుట్టినరోజు సందర్భంగా సినిమాలో ఆమె పాత్ర తాలూకు మోషన్‌ పోస్టర్‌ విడుదల చేశారు. పెళ్లి కూతురి పాత్రలో కనిపిస్తోంది అందులో నయనతార. 

సైరా నరసింహారెడ్డి భార్య 'సిద్దమ్మ' పాత్రలో నయనతార నటిస్తోంది. సినిమాలో ఈ పాత్రను చాలా కీలకంగా తీర్చిదిద్దారట. నయనతారతో పాటు ఈ సినిమాలో బిగ్‌బీ అమితాబ్‌బచ్చన్‌, జగపతిబాబు, సుదీప్‌, విజయ్‌ సేతుపతి, తమన్నా తదితరులు ఇతర కీలక పాత్రలు పోషిస్తున్నారు. అమితాబ్‌ బచ్చన్‌ గోసాయి వెంకన్నగా నరసింహారెడ్డికి గురువు పాత్రలో కనిపించనున్నారు. అవుకు రాజు పాత్రలో సుదీప్‌ కనిపించనున్నారు. కొణిదెల ప్రొడక్షన్స్‌ బ్యానర్‌లో ఈ సినిమాని రామ్‌చరణ్‌ నిర్మిస్తున్నారు. 

విదేశాల్లో షూటింగ్‌ పూర్తి చేసుకుని వచ్చిన 'సైరా' ప్రస్తుతం 'హైద్రాబాద్‌లో షూటింగ్‌ జరుపుకుంటోంది. సురేందర్‌ రెడ్డి ఈ చిత్రానికి దర్శకుడు. చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా విడుదలైన 'సైరా' టీజర్‌ ఇప్పటికీ ఫ్రెష్‌ అఫ్పీల్‌తో అభిమానుల్ని వెంటాడేస్తోన్న సంగతి తెలిసిందే. 

వచ్చే ఏడాది సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఆలోగా 'సైరా' నుండి రాబోయే ఒక్కొక్క సర్‌ప్రైజ్‌ ఒక్కో రకంగా అభిమానుల్ని మెస్మరైజ్‌ చేయనుందట.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS