ఆ సినిమానికి పబ్లిసిటీ అలా చేస్తున్నారు.!

మరిన్ని వార్తలు

లిప్‌లాక్స్‌ ఫార్ములాతో ఈ మధ్య వస్తున్న చిన్న సినిమాలు ఎలాంటి సెన్సేషన్‌ని అందుకుంటున్నాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. త్వరలో విడుదల కానున్న ఈ తరహా కాన్సెప్ట్‌ మూవీకి చిత్ర యూనిట్‌ చేస్తున్న పబ్లిసిటీ చూస్తుంటే ఆశ్చర్యమేస్తోంది. '24 కిస్సెస్‌' టైటిల్‌తో హెబ్బా పటేల్‌ హీరోయిన్‌గా, అరుణ్‌ అదిత్‌ హీరోగా ఓ చిత్రం తెరకెక్కిన సంగతి తెలిసిందే. 

డిశంబర్‌లో '24 కిస్సెస్‌' ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా చిత్ర యూనిట్‌ ప్రమోషన్స్‌ షురూ చేసింది. ఇందులో పెద్ద విశేషమేముంది అనుకుంటే పొరపాటే. ఓ టీవీ ఛానెల్‌లో ఈ సినిమాపై పబ్లిక్‌ ఒపీనియన్‌ పేరుతో ఓ ప్రోగ్రామే కండక్ట్‌ చేసేశారు తెలుసా? ఈ ప్రోగ్రాంలో భాగంగా సామాన్య జనంతో చిత్ర టీమ్‌ మమేకమై, వారి వారి అభిప్రాయాలను తెలుసుకుందన్న మాట. అయితే ఆ తెలుసుకోవడానికి కాస్త కాంట్రవర్సీ జత చేసి, ఇంకాస్త మసాలా కూడా దట్టించి ఆడియన్స్‌ని ఎట్రాక్ట్‌ చేసే ప్రయత్నం చేశారు. 

'మిణుగురులు' సినిమాతో అవార్డులు అందుకున్న అయోధ్యకుమార్‌ కృష్ణం శెట్టి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో ఎలాంటి అభ్యంతరకర సన్నివేశాలు లేవనీ టైటిల్‌ '24 కిస్సెస్‌' అని ఉన్నా, ఇది క్లీన్‌ మూవీ అని చెబుతున్నారు కానీ, ప్రచార చిత్రాలు చూస్తుంటే అలా అనిపించడం లేదు సరికదా ఖచ్చితంగా యూత్‌ని ఎట్రాక్ట్‌ చేసే సినిమాగానే అనిపిస్తోంది. అందుకే ఓ వర్గం ప్రేక్షకుల నుండి ఈ సినిమాకి తీవ్ర వ్యతిరేకత వస్తోంది. 

ఇలాంటి సినిమాల వల్ల యూత్‌కి, సమాజానికి ఏం మెసేజ్‌ ఇస్తున్నారంటూ కొంచెం గట్టిగానే ప్రశ్నిస్తున్నారు ఆ వర్గం వారు. ఏది ఏమైతేనేం. సినిమాలో ఏం చూపించారనేది తెలియాలంటే విడుదల డేట్‌ వరకూ ఆగాల్సిందే. డిశంబర్‌ 21న '24 కిసెస్‌' ప్రేక్షకుల ముందుకు రానుంది.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS