తమిళ సినీ పరిశ్రమకు సంబంధించి ఈ మధ్యకాలంలో లేడీ సూపర్ స్టార్.. అంటే అది నయనతార మాత్రమే. కెరీర్‌లో ఎన్నో ఎత్తు పల్లాలు చవిచూసిన నయనతార, వ్యక్తిగత జీవితంలోనూ ఎన్నో సమస్యల్ని ఎదుర్కొంది. ఎదురైన ప్రతి సవాల్‌నీ మరింత ధైర్యంగా ఎదుర్కొని, అటు జీవితంలోనూ.. ఇటు కెరీర్‌లోనూ నిలదొక్కుకుని.. లేడీ సూపర్ స్టార్ అన్పించుకుంది. నయనతార తన పుట్టినరోజు వేడుకల్ని విదేశాల్లో జరుపుకుంటూ వస్తోన్న విషయం విదితమే. ఇప్పుడు కూడా ఆమె తన బాయ్‌ఫ్రెండ్ విఘ్నేష్ శివన్‌తో కలిసి న్యూయార్క్‌లో తన పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకుంటోంది. ఈ మేరకు కొన్ని ఫొటోల్ని కూడా సోషల్ మీడియాలో షేర్ చేసింది నయనతార.
గతంలో శింబుతోనూ, ఆ తర్వాత ప్రభుదేవాతోనూ ప్రేమ వ్యవహారాన్ని నడిపిన నయనతార, ఆ బంధాన్ని పెళ్ళి వరకూ తీసుకెళ్ళలేకపోయింది. అయితే, విఘ్నేష్ శివన్‌తో మాత్రం అంతకు మించిన అనుబంధాన్ని కొనసాగిస్తోంది. ఇద్దరికీ పెళ్ళి అయిపోయిందనే ప్రచారం జరుగుతున్నా, నయనతార మాత్రం ఆ వ్యవహారాన్ని గోప్యంగా వుంచేందుకు ప్రయత్నిస్తోంది. విఘ్నేష్ - నయనతార గత కొంతకాలంగా సహజీవనం చేస్తున్న విషయం విదితమే. ఆ విషయాన్ని పక్కన పెడితే, ప్రస్తుతం నయనతార వరుస సినిమాలతో బిజీగా వుంది తమిళంలో.
తెలుగులోనూ ఆమెకు అవకాశాలు బాగానే వచ్చే పరిస్థితులు వున్నా, సినిమా ప్రమోషన్స్‌కి అందుబాటులో వుండకపోవడంతో.. ఆమెతో సినిమాలంటే దర్శక నిర్మాతలు ఒకటికి పదిసార్లు ఆలోచించాల్సి వస్తోంది. నయనతార తెలుగులో ఇటీవల చిరంజీవి సరసన 'సైరా నరసింహారెడ్డి' సినిమాలో నటించిన విషయం విదితమే.