చిరంజీవి నుంచి ఎంతో ప్రతిష్టాత్మకంగా వచ్చిన చిత్రం `సైరా`. తొలి రెండు రోజుల్లోనూ.. ఆహా ఓహో అన్నారంతా. కానీ.. క్రమంగా డివైడ్ టాక్ ఎక్కువైంది. వసూళ్ల ప్రభంజనం తగ్గింది. అయితే.. టికెట్ రేట్లు పెంచడం, దానికి చిరు ఇమేజ్ తోడవ్వడంతో - భారీ ఓపెనింగ్స్ వచ్చాయి. తెలుగులో బయ్యర్లు స్వల్ప నష్టాలతో బయపడ్డారు. కాకపోతే... మిగిలిన భాషల్లో ఈ సినిమా ఫ్లాప్ అయ్యింది. బాలీవుడ్‌లో అయితే... ప్రమోషన్ ఖర్చులు కూడా వెనక్కి రాలేదు.
అక్కడ చరణ్ ఈ సినిమాని సొంతంగా విడుదల చేసుకోవడంతో- ఇప్పుడు అక్కడి బయ్యర్లకు థియేటర్ల రెంట్లు వెనక్కి చెల్సించాల్సివస్తోంది. దాదాపు పది కోట్లు చరణ్ చెల్లించాల్సివస్తోందని సమాచారం. అంతేకాదు... ఇక్కడి బయ్యర్లు స్పల్పంగా నష్టాలు చవి చూశారు కాబట్టి - వాళ్లు చెల్లించాల్సిన జీఎస్‌టీకి కూడా చరణ్ చెల్లిస్తానని మాటిచ్చాడట. ఆ రూపంలో చరణ్ కి మరో 5 కోట్లు తిరిగి ఇవ్వాల్సిన పరిస్థితి వచ్చిందట. మొత్తానికి ఈ సినిమాతో చరణ్ నిర్మాతగా మిగుల్చుకున్నది ఏమీ లేదని సమాచారం.