వెంకీ సరసన నయనతార?

By iQlikMovies - March 28, 2018 - 09:00 AM IST

మరిన్ని వార్తలు

విక్టరీ వెంకటేష్‌, మెగా ప్రిన్స్‌ వరుణ్‌ తేజ్‌ కాంబినేషన్‌లో ఓ మల్టీ స్టారర్‌ తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకి 'ఎఫ్‌ 2' అనే టైటిల్‌ను కూడా ఫిక్స్‌ చేశారు. 'ఎఫ్‌ 2' అంటే 'ఫన్‌ అండ్‌ ఫ్రస్టేషన్‌' అని అర్ధమట కూడా. అయితే ఈ సినిమాలో వెంకీకి జోడీగా నయనతార నటించనుందని ప్రచారం జరుగుతోంది. 

వెంకీ, నయన్‌ది సక్సెస్‌ కాంబినేషన్‌. గతంలో 'తులసి', 'లక్ష్మీ' తదితర చిత్రాలు విజయవంతమయ్యాయి. ఇటీవల మారుతి దర్శకత్వంలో 'బాబు బంగారం'లోనూ నయనతార, వెంకీతో జత కట్టింది. అయితే ఈ సినిమా ఆశించిన ఫలితాన్ని అందించకపోయినా, వెంకీ, వరుణ్‌ మల్టీ స్టారర్‌ కోసం నయన్‌నే ఎంచుకోవాలని యోచిస్తోందట చిత్ర యూనిట్‌. అయితే నయనతారది గెస్ట్‌ అప్పియరెన్స్‌ మాత్రమే అనే టాక్‌ వినిపిస్తోంది మరో పక్క. అనిల్‌ రావిపూడి తెరకెక్కిస్తోన్న ఈ చిత్రాన్ని దిల్‌రాజు నిర్మిస్తున్నారు. ఓ డిఫరెంట్‌ కామెడీ నేపథ్యంలో ఈ చిత్రం రూపొందుతోంది. 

'గురు' తర్వాత వెంకీ కాస్త గ్యాప్‌ తీసుకున్నా, ఇప్పుడు వరుస సినిమాలతో జోరు పెంచేశాడు. ఈ సినిమాతో పాటు వెంకీ లిస్టులో తేజ డైరెక్షన్‌లో చేయాల్సిన 'ఆటా నాదే వేటా నాదే' సినిమా ఒకటి, అబ్బాయ్‌ రానాతో మరో మల్టీ స్టారర్‌ ఉన్నాయి. త్వరలోనే ఈ సినిమాలు కూడా పట్టాలెక్కనున్నాయి. ఇకపోతే వరుణ్‌ తేజ్‌ విషయానికి వస్తే, ఇటీవలే 'తొలిప్రేమ'తో బీభత్సమైన హిట్‌ కొట్టి జోష్‌ మీదున్నాడు. 

అదే జోష్‌తో 'ఘాజీ' సినిమాతో అందరి దృష్టినీ ఆకర్షించిన సంకల్ప్‌ రెడ్డి దర్శకత్వంలో ఓ విభిన్న చిత్రానికి సైన్‌ చేశాడు. స్పేస్‌ నేపథ్యంలో తెరకెక్కుతోన్న ఈ చిత్రంలో వరుణ్‌ ఏస్ట్రోనాట్‌గా నటించనున్నాడు.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS