మా చెల్లికి జరగాలి పెళ్లి..
మళ్లీ మళ్లీ
- అంటూ యమలీలలో భరణి నవ్వించాడు.
మళ్లీ పెళ్లేంట్రా బాబూ.. అంటూ జనాలు కూడా పడీ పడీ నవ్వారు. కొంతమంది సీనీ తారలకు ఇలానే మళ్లీ మళ్లీ పెళ్లి జరుగుతుంటుంది. మీడియా దయ వల్ల.
నయనతార పెళ్లి- ఇంతకంటే.. రొటీన్ టాపిక్ మీడియాకు ఉండదు. సీజన్ కి ఓసారి ఫ్రెష్షుగా నయన పెళ్లి టాపిక్ బయటకు వస్తుంటుంది. నయన - విఘ్నేష్ ల ప్రేమకథ తెలియంది కాదు. ఇద్దరూ డేటింగ్ లో ఉన్నారన్నది వాస్తవం. అయితే వీళ్లకు రహస్యంగా పెళ్లయిపోయిందని కొంతమంది నమ్మకం. ఈమధ్య ఇద్దరూ గొడవ పడి విడిపోయారని కూడా అన్నారు. అయితే.. ఇప్పుడు మళ్లీ.. పెళ్లి టాపిక్ బయటకు వచ్చింది. ఇటీవల నయన - విఘ్నేష్‌లు చెన్నైలోని గుళ్ల చుట్టూ ప్రదక్షిణాలు చేస్తున్నార్ట. నయన త్వరలోనే దోష నివారణ పూజలు చేయించుకుంటోందని తమిళనాట ఫిల్మ్ సర్కిల్ లో గుసగుసలు వినిపిస్తున్నాయి.సాధారణంగా పెళ్లికి ముందు ఇలాంటి పూజలు జరుగుతుంటాయి. దాంతో నయన పెళ్లి చేసుకోబోతోందన్న వార్తలకు మళ్లీ ఊతం వచ్చింది. త్వరలోనే నయన - విఘ్నేష్ లు పెళ్లి చేసుకుంటారని, అందుకే ఇప్పుడు పూజలతో ఈ జంట బిజీగా ఉందన్నది ఆ వార్తల సారాంశం. ఈసారైనా నయన పెళ్లి చేసుకుని, ఆ కబురు మీడియాకు చెప్తే గానీ నయన పెళ్లి వార్తలకు పుల్ స్టాప్ పడదు.