జూనియర్స్‌కి నో చెబుతున్న నయన్‌.!

మరిన్ని వార్తలు

సీనియర్‌ హీరోలు, జూనియర్‌ హీరోలు అనే తేడా లేకుండా నటించే నయనతార ప్రస్తుతం రూటు మార్చేసింది. ఈ మధ్య నయనతార సీనియర్‌ హీరోల సినిమాల్లోనే ఎక్కువగా కనిపిస్తోంది. ఇకపై కూడా సీనియర్స్‌తోనే నటిస్తానని నిక్కర్చిగా చెప్పేస్తోందనీ కోలీవుడ్‌ టాక్‌. హీరోయిన్‌ ఓరియెంటెడ్‌ పాత్రలయితే ఓకే కానీ, జూనియర్‌ హీరోల సినిమాల్లో ఇకపై కనిపించాలనుకోవడం లేదట. సౌత్‌లో అత్యధిక రెమ్యునరేషన్‌ అందుకుంటోన్న హీరోయిన్‌గా చెలామణీ అవుతోంది నయనతార. రెమ్యునరేషన్‌ ఎక్కువయినా, ప్రమోషన్స్‌కి రాకపోయినా ఆమెతో సినిమాలు తెరకెక్కించేందుకు క్యూ కడుతుంటారు తెలుగు, తమిళ దర్శక, నిర్మాతలు. ఆమె తమ సినిమాలో ఉందంటే, ఆ సినిమా రేంజే వేరు. ఆ రేంజ్‌ కోసమే, ఏరి కోరి ఎక్కువ రెమ్యునరేషన్‌ ఇచ్చి అయినా సరే, నయన్‌ని తమ సినిమాల్లో హీరోయిన్‌గా తీసుకుంటుంటారు.

 

అయితే, నయన్‌ తాజాగా తీసుకున్న ఈ నిర్ణయంతో పాపం జూనియర్‌ హీరోల పరిస్థితేంటీ.? ఇకపోతే, గతేడాది టాలీవుడ్‌లో మెగాస్టార్‌ చిరంజీవి సరసన 'సైరా నరసింహారెడ్డి' సినిమాలో నటించిన నయనతార, ఈ ఏడాది సూపర్‌ స్టార్‌ రజనీకాంత్‌తో 'దర్బార్‌' సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఆమె ఫ్యూచర్‌ ప్రాజెక్టుల విషయానికి వస్తే, తమిళంలో రెండు సినిమాల్లో నటిస్తోంది. తెలుగు విషయానికి వస్తే, బాలయ్య - బోయపాటి సినిమా కోసం నయన్‌తో సంప్రదింపులు జరుగుతున్నాయట. ఇదిలా ఉంటే, త్వరలో నయనతార పెళ్లి చేసుకోబోతోందనే వార్తలు వినిపిస్తున్నాయి. డైరెక్టర్‌ విఘ్నేష్‌ శివన్‌తో గత కొంతకాలంగా నయన్‌ పీకల్లోతు ప్రేమలో ఉన్న సంగతి తెలిసిందే.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS