గ్లామ్‌షాట్‌: ఈ గ్లామర్‌ 'క్వీన్‌'ని గుర్తు పట్టారా.?

మరిన్ని వార్తలు

'లీడర్‌' సినిమాతో తెలుగు ప్రేక్షకుల్ని పలకరించిన ముద్దుగుమ్మ ప్రియా ఆనంద్‌. తొలి సినిమా అయినా ఆ సినిమాలో బబ్లీ గాళ్‌గా ప్రియా నటన అందర్నీ ఆకట్టుకుంది. కానీ, ఈ సినిమాలో మెయిన్‌ లీడ్‌ హీరోయిన్‌గా నటించిన రీచా గంగోపాధ్యాయకే అసలు సిసలు హీరోయిన్‌ మార్కులు దక్కాయి. ఆ తర్వాత 'రామ రామ కృష్ణ కృష్ణ' సినిమాలో ఇద్దరు హీరోయిన్స్‌లో వన్‌ ఆఫ్‌ ది హీరోయిన్‌గా నటించింది ప్రియా ఆనంద్‌. ఆ తర్వాత ఒకటీ అరా సినిమాల్లో కనిపించింది. కానీ, పెద్దగా ఫేమ్‌ దక్కించుకోలేకపోయింది. తమిళ, కన్నడ, హిందీ భాషల్లోనూ పలు సినిమాల్లో నటించిన ప్రియా ఆనంద్‌కి మోడలింగ్‌ రంగంలోనూ మంచి అనుభవం ఉంది. ప్రస్తుతం ఓ తమిళ సినిమాలోనూ, ఓ కన్నడ సినిమాలోనూ నటిస్తోన్న ప్రియా ఆనంద్‌ సోషల్‌ మీడియాలో గ్లామర్‌ క్వీన్‌ అవతారమెత్తింది. ఓ స్పెషల్‌ ఫోటో షూట్‌తో ఆకట్టుకుంది.

తలపై కిరీటం ధరించి, సిల్వర్‌ కలర్‌ యువరాణి దుస్తుల్లో ధగ ధగలాడిపోతోంది. బ్యాక్‌ గ్రౌండ్‌లో బ్రైట్‌ లైటింగ్‌తో సైడ్‌ వ్యూలో ఫోటోకి పోజిచ్చింది. ఫేస్‌లోని స్వీట్‌ స్మైల్‌ 'ప్రియా ప్రియా..' అంటూ కుర్రోళ్ల గుండె జారి గల్లంతయ్యేలా చేస్తోంది. ఇలాంటి గ్లామర్‌ ఫోటోలు నెట్టింట్లో ఓ నాలుగైదు వదిలితే, పాపని గుర్తు పెట్టుకుంటారు. లేదంటే, మర్చిపోతారు మరి.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS